NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: ఏపీ రాజకీయాలలో మరోసారి చంద్రబాబు గాలి తీసేసిన 23 నెంబర్..!!

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని 23 నెంబర్ అసలు వదలటం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే కొన ప్రాణం తో.. ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఇప్పటి వరకు ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేయకుండా.. ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబు తో పాటు మిగతా టిడిపి కీలక నాయకులు చాలావరకు ఇంటికి పరిమితం కావడంతో టీడీపీకి బలంగా ఉండే క్యాడర్ లో.. పార్టీ అధినాయకత్వంపై నమ్మకం పోయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అనంతపురం జిల్లా కీలక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా. .. టిడిపి హైకమాండ్ పై విమర్శలు చేయడం జరిగింది. కాగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అయిన.. అర్హత ఉంటే… ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. పథకాలు అందిస్తున్నారు.

թɾαѵҽҽղ ° ?'s tweet - "Hearty Congratulations KUPPAM MPP Hasini Ashwini HM Ashwini Hasini Ysrcp Kuppam sister.... finally it's a great victory Feeling proud of u sister....?????????????? #YSRCPMarkVictory " - Trendsmap

మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా టీడీపీ పార్టీని చిత్తుచిత్తుగా జనాలు ఓడిస్తూ వస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో దాదాపు 70 సీట్లకు పైగా నే వైసీపీ గెలవడం జరిగింది. ఒక తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ మాత్రమే టీడీపీ కైవసం అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు వైసిపి ప్రభంజనం సృష్టించింది. వార్ వన్ సైడ్ అన్న తరహాలో పరిషత్ ఫలితాల్లో ప్రజలు జగన్ పార్టీకి పట్టం కట్టారు. రాయలసీమలో తొలి చేయగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక స్థానాలు నారావారిపల్లె అదే రీతిలో నిమ్మకూరులో కూడా వైసిపి అభ్యర్థులు గెలవడం ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇరవై మూడు సంవత్సరాల వయస్సు కలిగిన హాసిని అశ్విని అనే అమ్మాయి.. గెలవటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1240.. ఉండగా వైసిపి.. పార్టీకి పోలైన ఓట్లు 1143.. టిడిపి పార్టీకి పోలైన ఓట్లు 70..నోటాకి 27. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 23 సంవత్సరాల అమ్మాయి చేత జగన్.. చంద్రబాబు కంచు కోటలు పగలగొట్టారని ఏపీ పాలిటిక్స్ లో టాక్.

చంద్రబాబు నీ ఇంకా వదలనీ 23 నెంబర్.. 

అంత మాత్రమే కాక చంద్రబాబు నీ 23 నెంబర్ ఇంకా వదలలేదనీ.. ఇప్పుడు ఏకంగా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన గాలి తీసేలా పరిషత్ ఫలితాల్లో.. 23 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయి గెలవటం జరిగిందని .. ఇది మామూలు విషయం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో క్యాడర్ ని కాపాడుకోలేని చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న టిడిపి క్యాడర్ ని ఇంకెలా కాపాడుకో గలుగుతారు.. అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఒకపక్క వయసు తగ్గిపోవడం మరోపక్క పార్టీని.. ముందుకు నడిపించే భవిష్యత్ నాయకుడు కూడా.. టిడిపిలో కనబడకపోవడం ఇదంతా పెద్ద మైనస్ అని అభివర్ణిస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను తీసుకోవటం..తో.. ఆ పాపం ఇంకా చంద్రబాబును వెంటాడుతూనే ఉన్నట్లు ఉందని.. వైసీపీ నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో ఇరవై మూడు సంవత్సరాల వయస్సు కలిగిన అశ్విని…

ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఇరవై మూడు సంవత్సరాల వయస్సు కలిగిన అశ్విని ఎంపీటీసీ గెలవటం .. 30 ఏళ్ల చరిత్రను తిరగ రాయడమే అని అంటున్నారు. ఎందుకంటే 1989 నుండి చంద్రబాబు కు కంచుకోట గా ఉన్న కుప్పం లో టిడిపి తప్ప మరో పార్టీ ఎంపీపీ zptc గెలవలేదు. ఈ క్రమంలో తెలుగు రాజకీయాలలో చాణిక్యుడు అనిపించుకునే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో.. తనదైన వ్యూహాలతో.. ఒక యువ మహిళ నీ.. జగన్ గెలిపించుకోవడం.. మామూలు విషయం కాదని.. కుప్పం నియోజకవర్గంలో మాత్రమే కాక టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు లో కూడా వైసీపీ గెలవడం నిజంగా ఏపీలో వైసీపీ కి మరోసారి తిరుగులేదు అని పరిషత్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ఏపీ రాజకీయాల్లో టాక్. ఇదిలా ఉంటే ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర టిడిపి.. సరైన రీతిలో పోషించ కపోతే.. రాబోయే రోజుల్లో మరింత మూల్యం.. పార్టీ నేతలు చెల్లించే పరిస్థితి ఉంటుందని.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు అయిన పరిషత్ ఎన్నికలు అయినా ఎక్కడా కూడా జగన్.. ప్రచారం లేదా ఒక మీడియా సమావేశం కూడా పెట్టకుండా.. ఈ రీతిగా విజయం సాధించటం.. మామూలు విషయం కాదని ఏపీ రాజకీయాల్లో లేటెస్ట్ టాక్.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju