NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu : చంద్రబాబు కు సెమీ ఫైనల్స్!

Chandrababu : చంద్రబాబు కు సెమీ ఫైనల్స్!

Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఎంత ప్రతిష్టాత్మకమో తెలియదు కానీ… తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ ఎన్నికల డూ ఆర్ డై ఎన్నికలు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు దేశం పార్టీకి సెమీఫైనల్స్. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కచ్చితంగా ఉనికి నిలుపుకోవాలంటే… రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం గా ఉండాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా కొన్ని సీట్లు అయినా గెలవాలి… కొన్ని కాదు తన ఉనికిని జరుపుకునేలా తన ప్రభావం చూపేలా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోరాడాల్సి ఉంది. జమిలి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు Chandrababu  నాయకత్వానికి ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా పోరాడింది ఎలా ముందుకు వెళ్ళింది ఫలితాల్లో ఎంత ప్రభావం చూపింది అన్న దాని మీద వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సిపి కు పోటీనిచ్చేది ఏ పార్టీ నో తెలిసిపోతుంది.

Chandrababu : semifinals for chandrababu
Chandrababu : semifinals for chandrababu

 

బీజేపీ రెడీగా!

బిజెపి ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో సొంతంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సమయం ఏది రాలేదు. ఆ పార్టీ సైతం రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఎలాంటి కృషి చేయలేదు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు గెలిచినా ఓడినా పెద్దగా వచ్చేది ఉండదు పోయేది ఉండదు. అయితే టిడిపి ఎలాంటి పోటీ ఇవ్వగలుగుతుంది అన్న దానిమీద మాత్రం బీజేపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం వైఎస్ఆర్సీపీ కు ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ఈ ఎన్నికల్లో ఎంత మేర పోరాడుతుంది అన్నదాని మీదే వచ్చే ఎన్నికల్లో అది ఎంత ప్రభావం చూపుతుంది అన్న అంచనా తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీకి ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉన్న బిజెపి దీనిమీద ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా డీలా పడితే… ఆ అడ్వాంటేజ్ ను బిజెపి చక్కగా తీసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి పరాజయాన్ని సాకుగా చూపి.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బలంగా పోరాడే అవకాశాలు ఉన్నాయి. ఎలాగో ప్రతిపక్షంగా టీడీపీ ను దెబ్బ తీయాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ సైతం ఈ సమయం కోసం వేచి చూసి బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మేలు చేసే చర్యలు చేపట్టవచ్చు. బీజేపీకి మేలు చేయడం ద్వారా ప్రతిపక్ష హోదాలో కి…. వైయస్సార్సీపి కు ప్రత్యామ్నాయంగా బిజెపిని ప్రజల్లో చూపించాలని ఏది ప్లాన్. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా బీజేపీ కు మల్లవచ్చు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయ్యే దారి వేసేందుకు జగన్ బీజేపీ కు సహకరించవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు రాజకీయ శత్రువు ఉండాలి అనే కోణంలో బీజేపీతో తలపడటానికి జగన్ ఇష్టపడటం…. టిడిపి ను పూర్తిగా నిర్వీర్యం చేసి బిజెపి ను ఆ స్థానంలో తీసుకొచ్చి ప్రజలకు రాజకీయ ప్రత్యర్థిగా చూపడానికి జగన్ కు అన్నీ రకాల ఇష్టమే. ఇప్పుడు ఇదే ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎంత మీద పోరాడుతుంది ఎంత మీద విజయం సాధిస్తుంది అన్నదాని మీదే వచ్చే తిరుపతి లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి బిజెపి వ్యూహాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చూపకుండా తెలుగుదేశం పార్టీ రక్షణాత్మక ధోరణికి పరిమితం అయితే ఆ పార్టీకు పెను ప్రమాదం తప్పదు. దీనిని గుర్తించే చంద్రబాబు ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఏకగ్రీవాలు లేకుండా పూర్తిస్థాయిలో పోరాడాలని కార్యకర్తలకు ప్రతిరోజు సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీని బతికించుకోవడం అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటే దారి అన్న కోణంలో చంద్రబాబు హిత బోధ చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఆ పార్టీకి అంత అనుకూలంగా లేవు. ఇక ఈ ఎన్నికల్లో ఫలితాలు టీడీపీ భవిష్యత్తు అన్నది కాలమే నిర్ణయించాలి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?