NewsOrbit
రాజ‌కీయాలు

నాయిని కోసం కేసీఆర్ ఎందుకు ఏడ్చారో తెలుసా..!?

cm kcr emotion about naini narasimha reddy

బుల్లెట్ కిక్ కొట్టాడంటే.. ఆ సౌండ్ తాలూకు శబ్దం బండి సైలెన్సర్ లో కాదు.. అతని ముఖంలో కనబడేది. అన్నా.. కష్టంలో ఉన్నామంటూ కార్మికులు అంటే.. తమ్ముడు నేనున్నా అంటూ ఆసరా ఇచ్చేవాడు.. 50 ఏళ్ల క్రితం ఎంతటి ధీరత్వం ఉందో 86 ఏళ్ల వయసులోనూ అదే ధీరత్వం. ఆ మీసం ఎప్పుడూ కిందికి దిగలేదు. ఆయనే.. నాయిని నరసింహారెడ్డి. కార్మిక నాయకుడిగా కార్మికుల ఆశాజ్యోతిగా బతికిన నాయిని ఇప్పుడు లేరు. అనారోగ్యంతో పోరాడి 86 ఏళ్ల వయసులో తన వాళ్లను, కార్మికులను, పార్టీని వదిలివెళ్లిపోయారు. గంభీరమైన ఆయన ముఖం.. పైకి మెలితిప్పి ఉండే ఆయన మీసం.. ఒక యోధుడి పౌరుషం ఒక చరిత్రగా మిగిలిపోయింది.

cm kcr emotion about naini narasimha reddy
cm kcr emotion about naini narasimha reddy

కార్మిక నాయకుడిగా.. సమస్యలకు బాసటగా..

1934లో నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియాలో నేరేడుగొమ్ములో సాధారణ రైతు కుటుంబంలో నాయిని జన్మించారు. హెచ్ ఎస్సీ వరకూ చదువుకున్నారు. కార్మిక నాయకుడిగా ఎదిగారు. లేబర్ సమస్యలే తన అజెండాగా తిరిగారు నాయిని. అప్పట్లో హైదరాబాద్ లో కార్మికుల తరపున మాట్లాడేది, వారి సమస్యలపై గళమెత్తింది నాయిని మాత్రమే. 50 ఏళ్ల క్రితం వీఎస్టీ ఇండస్ట్రీస్ లో కార్మిక నాయకుడిగా ఆయన ఎలా ఉన్నారో.. మంత్రిగానూ ఆయన గొంతు అలానే వినిపించారు. కార్మిక వాసననే ఊపిరిగా బతకడమంటే మామూలు విషయం కాదు.

అందుకే కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు..

1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు సాధించలేనిది మలి తెలంగాణ ఉద్యమంలో సాధించాలని కేసీఆర్ కు వెన్నంటి నడిచారు. టీఆర్ఎస్ జెండా మోసారు. రాష్ట్రం సాధించారు. తొలి ప్రభుత్వంలో హోంమంత్రి అయ్యారు.. కష్టపడిన పార్టీలో కొన్నాళ్లుగా కాస్త అసంతృప్తి. అల్లుడికి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోలేక పోవడం.. పార్టీనే వదిలి వెళ్లిపోతారని వ్యాఖ్యలు.. ఇలా పలు రకాలుగా సాగింది ఆయన చివరి రాజకీయ దశ. కానీ.. నాయిని త్యాగాలను సీఎం కేసీఆర్ మర్చిపోలేదు. తనను నమ్మి నడిచిన నాయిని పరిస్థితికి చలించిపోయారు. కార్మికుల కోసం తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం కేసీఆర్ కు తెలుసు. అందుకే కేసీఆర్ కంట కన్నీరు. ఏదేమైనా.. కార్మికలోకంలో.. టీఆర్ఎస్ లో.. మొత్తంగా తెలంగాణలో నాయిని ఓ వెలుగు దివ్వె..!

 

 

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju