NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అంతా బానే ఉంది జగన్ … కానీ ‘ ఆ పాయింట్ ‘ లో అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉన్నావ్ ! 

2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో వైయస్ జగన్ గెలిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక విపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఒక ఫ్యాక్షనిస్టు, అవినీతి చక్రవర్తి చేతికి రాష్ట్రాన్ని ప్రజలు అప్పజెప్పారు అని ఏపీ పని అయిపోయిందని అనేక విమర్శలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అసలు అనుభవం లేదని ఆర్థిక నేరస్థుడు అన్నట్టుగా అనేక విమర్శలు అప్పట్లో వచ్చాయి. కానీ జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నకా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దాదాపు పదహారు నెలల జగన్ పరిపాలనకు దేశంలో మహామహులు ఆశ్చర్యపోయే రీతిలో నిర్ణయాలు తీసుకున్నట్లు అనేక సర్వేలలో బయటపడింది. అంతేకాకుండా ఇప్పటిదాకా జరిగిన సర్వేలో టాప్ ఫైవ్ కిందకి రాకుండా పై లోనే ఉంటూ ఏపీకి అద్భుతమైన పరిపాలన వైయస్ జగన్ అందిస్తున్నారని అనేక సర్వేలలో ఫలితాలు వెలువడ్డాయి.

Free Power Will Remain Free Forever: AP CM YS Jaganకరోనా లాంటి కష్టకాలంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ ఆగిపోకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని, దేశంలోనే జగన్ ముందు చూపు కలిగిన నాయకుడు అంటూ చాలా మంది ప్రశంసలు అప్పట్లో తెలిపారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే దాదాపు 90 శాతం వాగ్దానాలు నెరవేర్చటం మామూలు విషయం కాదని విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ పరిస్థితి అంతా బాగానే ఉన్నా గాని పార్టీ పరంగా నాయకుల పరంగా చాలా వరకు కనిపించని డ్యామేజ్ లోలోపల జరుగుతున్నట్లు సామాన్య ప్రజలలో అదేవిధంగా మేధావులలో జోరుగా చర్చ జరుగుతోంది.

 

వైయస్ జగన్ తన కింద ప్రజాప్రతినిధులకు అవినీతి వ్యవహారాల్లో చాలా దూరం ఉండాలని, ఏమాత్రం విషయం తేడా జరిగితే చర్యలు గట్టిగా ఉంటాయని ముందు నుండి చెప్పుతున్నే ఉన్నారు. అయితే ఈ విషయంలో చాలాచోట్ల నాయకులు ఎమ్మెల్యేలు చేతివాటం చూపిస్తూ ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా లో పదే పదే హైలెట్ అవ్వటం తో ఏపీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు అవుతుందని, పైగా ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో పార్టీలో ఉన్న నాయకులు సైతం విఫలమవుతున్నట్లు వార్తలు ఏపీ మీడియా సర్కిల్ లో వినపడుతున్నాయి.

 

ప్రభుత్వం మంచి పని చేసినా గాని దాన్ని హైలెట్ చేయడంలో…. క్రెడిట్ ప్రభుత్వానికి వచ్చేలా వ్యవహరించడంలో కూడా నాయకులు అట్టర్ ప్లాప్ అవుతున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఎంత మంచి చేసినా ఆ క్రెడిట్ ప్రభుత్వానికి దక్కే కీలక పాయింట్ విషయంలో జగన్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారని చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పార్టీలో చేతివాటం కలిగిన నాయకులను కంట్రోల్ చేసే విషయంలో, మంచి పనులు చేసిన టైములో ప్రభుత్వానికి క్రెడిట్ సంపాదించే విషయంలో జగన్ చాలావరకు దెబ్బతిన్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్లో టాక్ గట్టిగా నడుస్తోంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju