NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

Modi : మోడీ కొత్త క్యాబినెట్ టీం ఇదే… ప‌ద‌వి పోయే మంత్రులు ఎవ‌రంటే…  

Modi: గ‌త కొద్దికాలంగా వినిపిస్తున్న చ‌ర్చ‌కు చెక్ పెడుతూ త‌న క్యాబినెట్ స‌హ‌చ‌రుల విష‌యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. రేపు ప్ర‌ధాని త‌న క్యాబినెట్‌ను విస్త‌రించ‌నున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు మోదీ 2.0 ప్ర‌భుత్వంలో తొలిసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ కానుంది. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై రెండు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Read More: Narendra Modi: మోడీ కొత్త టీం ఇదే… ఎవ‌రెవ‌రికి చాన్స్ అంటే


ఇది లెక్క‌…

న‌రేంద్ర మోడీ క్యాబినెట్లో ప్ర‌స్తుతం 28 మంత్రి ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. దీని ప్ర‌కారం 17-22 మంది ఎంపీలకు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చాన్స్ క‌ల్పించ‌వ‌చ్చు. ఈ మేర‌కు క‌స‌ర‌త్తు జ‌రిగింది. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు బీహార్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం ల‌భిస్తుంద‌ని తెలుస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో తిరిగి బీజేపీ ప్ర‌భుత్వం కొలువు దీర‌డంలో కీల‌క భూమిక వ‌హించిన యువ‌నేత జ్యోతిరాదిత్య సింధియా, జ‌బ‌ల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ ల‌కు చోటు ద‌క్క‌వ‌చ్చు. మ‌రో ఇద్ద‌రు నేత‌లకు కూడా మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి చాన్స్ ల‌భిస్తుంద‌ని అంచ‌నా. ఇక బీహార్‌లో లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప‌శుప‌తి కుమార్ ప‌రాస్‌, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్‌లు మంత్రులుగా ప్ర‌మాణం చేయొచ్చు. ఈ రాష్ట్రం నుంచే ఇద్ద‌రు లేదా ముగ్గురు నేత‌ల‌కు చోటు ద‌క్కుతుంద‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Read More: Modi: మోడీ బ్యాడ్ టైం కాక‌పోతే.. ఇలా న‌వ్వుల పాలు అవ‌డం ఏంటి!

ఆమెకు చాన్స్ ప‌క్క‌.
ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అప్నాద‌ళ్ అధినేత అనుప్రియా ప‌టేల్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తున్న‌ది. ఆమె గ‌త నెల‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ను క‌లుసుకున్నారు. ఇక వ‌రుణ్‌గాంధీ, రాంశంక‌ర్ క‌థేరియా, అనిల్ జైన్‌, రీటా బ‌హుగుణ జోషి, జాఫ‌ర్ ఇస్లాం పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మ‌హారాష్ట్ర‌లోని బీజేపీ ఎంపీ హీనా గావిట్ కేంద్ర మంత్రిగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. వీరితోపాటు భూపేంద్ర యాద‌వ్‌, పూనం మ‌హాజ‌న్‌, ప్రీతం ముండే పేర్లు ప్ర‌స్తావ‌న‌లో ఉన్నాయి. ముగ్గురు మాజీ ముఖ్య‌మంత్రులు, ఒక మాజీ డిప్యూటీ సీఎంనూ మోదీ త‌న క్యాబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం తీర‌త్ సింగ్ రావ‌త్‌, అసోం మాజీ ముఖ్య‌మంత్రి శ‌ర్బానంద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణె కూడా కేంద్ర మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N