వంగవీటికి 100కోట్లిస్తా: కెఎపాల్

హైదరాబాద్, జనవరి 22: వంగవీటి రాధకృష్ణకు ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ వందకోట్ల రూపాయల ఆఫర్‌ను ప్రకటించాడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దని వంగవీటికి సూచించారు. తన పార్టీలో చేరితే ఎమ్మల్యే టిక్కెట్‌తోపాటుగా ప్రభుత్వం అధికారంలోకి  రాగానే మంత్రి పదవిని ఇస్తానని ఆయన  హమీ ఇచ్చారు.

తాను ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైతే 100 కోట్లు ఇస్తానని ఆయన చెప్పారు. ఈ నగదును వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా అందజేస్తానని ఆయన అన్నారు.

టిడిపిలో చేరితే రాధాకృష్ణను కాపులు ఎన్నటికీ క్షమించరని ఆయన చెప్పారు.

తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసిపి అధినేత వైఎస్ జగన్‌లనుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిదిగా హైదరాబాద్ సిపి అంజనీకుమర్‌కు ఆయన  ఫిర్యాదు చేశారు. తనపై తప్పుుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానల్స్ పై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.