NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భలే ఛాన్స్ లే .. లక్కీ ఛాన్స్ లే .. పుష్ప శ్రీవాణి కి సూపర్ ఛాన్స్ లే ! 

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కొద్దిమందికి వరం గా మారితే మరి కొద్ది మందికి తలనొప్పిగా మారింది. చాలామంది సీనియర్ రాజకీయ నేతలు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క పార్టీలో ఉన్న జూనియర్లకు మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు సరికొత్త అవకాశాలు తీసుకువస్తున్నట్లు పార్టీలో టాక్. ఈ విధంగానే ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కి లక్కీ ఛాన్స్ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తగిలే అవకాశం ఉందని పార్టీలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. 

 

pamula pushpa srivani: ఏపీ: కుల వివాదంలో ...ముఖ్యంగా గిరిజన ఎమ్మెల్యే కావటంతో ‘అరకు’ కొత్త జిల్లాగా ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు ఈ జిల్లా అన్ని పూర్తిగా గిరిజన జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉండటంతోపాటు అరకు జిల్లా పరిధిలోకి కురుపం, పార్వతీపురం, సాలూరు వస్తుండటం పుష్ప శ్రీవాణి కి కలిసొచ్చే అంశమని పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన కురుపం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న పుష్పశ్రీవాణి…. అరకు కొత్త జిల్లాగా ఏర్పడితే ఇక రాజకీయంగా ఆమె ఎదురు లేదన్న టాక్ గట్టిగా వినబడుతోంది. 

 

మరోపక్క పుష్ప శ్రీవాణి ఎదుగుదలను వైసీపీ పార్టీలో ఉండే కీలక నాయకులు అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు మొన్నటి వరకు చేయటం జరిగింది. ఇటువంటి తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ‘అరకు’ పూర్తిగా గిరిజన జిల్లాగా ఏర్పడితే ఇంకా పుష్పశ్రీవాణి పొలిటికల్ కెరియర్ కి బ్రేకులు వేసే వారు ఉండరు అని ఆమె సన్నిహితులు అంటున్నారు. అంతేకాకుండా విశాఖపట్టణంలో రాజధాని వచ్చే అవకాశం ఉండటంతో పుష్ప శ్రీవాణి రాజకీయ పరపతి పెరగటమే కాక ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. వైసీపీ పార్టీలో మొదటి నుండి జగన్ కి అత్యంత నమ్మకస్తురాలిగా పేరొందిన శ్రీవాణి…చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైములో అనేక ఇబ్బందులు ఆఫర్లు ఇచ్చిన శ్రీవాణి పార్టీ మారకుండా ఉండటంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వైయస్ జగన్ చాలా సందర్భాలలో పుష్పశ్రీవాణి తనకు మరో చెల్లి అంటూ సంబోధించడం జరిగింది.  ఇటువంటి తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాజధాని విశాఖ కి వచ్చాక… పుష్పశ్రీవాణి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. 

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju