NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Viveka Case: థర్డ్ డిగ్రీ.. లై డిటెక్టర్.. వివేకా కేసులో సీబీఐ దూకుడు..!!

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

YS Viveka Case: ఏపీలో సంచలన కేసుగా.. దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కేసు వైఎస్ వివేకా హత్య కేసు..! ఈ కేసు దర్యాప్తుని సీబీఐ దాదాపు 13 నెలల కిందటే ఆరంభించింది. ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. అయితే ఈ 13 నెలల సీబీఐ విచారణలో ఎన్నో ట్విస్టులు, ఎన్నో ఉదంతాలు, ఎన్నో మలుపులు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి..! ఈ హత్య కేసును ఛేదించే విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో పది రోజులు, పదిహేను రోజులు మాత్రమే విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఈ సారి 50 రోజులకుపైగా కడపలోనే తిష్టవేసి విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆధారాలు కొన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

YS Viveka Case: Third Degree Lie Detector to Suspects
YS Viveka Case Third Degree Lie Detector to Suspects

YS Viveka Case: వివిధ మార్గాల్లో అనుమానితుల గుర్తింపు..!

సీబీఐ విచారణను ఎవరూ ప్రశ్నించకుండా, రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే ఆ హత్య కేసులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలు పంచుకున్నారని భావిస్తున్న వారిని కఠిన ధోరణిలోనే విచారణ చేసినట్లు సమాచారం. వివేకా హత్య కేసులోతొలి నుండి ప్రధాన అనుమానితులుగా, ప్రధాన సాక్షులుగా అయిదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, నైట్ వాచ్ మెన్ రంగన్న అలియాస్ రంగయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా వీరితో పాటు స్థానిక వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ లు ఉండగా వీరిని సీబీఐ అధికారులు సీరియస్ గా విచారణ చేశారు. వీరిలో ఎర్ర గంగిరెడ్డిని దాదాపు 40 రోజుల పాటు విచారణ చేశారు.

కీలక దశలో థర్డ్ డిగ్రీ..!!

కేసు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు జమ్మలముడగు మెజిస్ట్రేట్ ముందు హజరు పర్చి 164 కింద సాక్షిగా వాగ్మూలాన్ని రికార్డు చేయడం జరిగింది. ఇది తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసులో సీబీఐ అధికారుల అనుమానితుల జాబితాలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తనను ఈ కేసులో సీబీఐ అధికారులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనీ, గతంలో తనను విచారణ పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్లిన సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనీ, లైడిటెక్టర్ తో పరీక్షలు చేశారనీ, ఆ సమయంలో ఖాళీ కాగితాలపై సంతకాలు కూడా తీసుకున్నారనీ సునీల్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సునీల్ కుమార్ పేర్కొన్నాడు. ఈ కేసులో ప్రతివాదిగా సీబీఐ డైరెక్టర్ ను చేర్చి తనకు ఈ కేసులో ఇరికించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వేడుకున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో సునీల్ కుమార్ యాదవ్ పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరిస్తుందా, ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది.

YS Viveka Case: Third Degree Lie Detector to Suspects
YS Viveka Case Third Degree Lie Detector to Suspects

అయితే ఇటీవల కాలంలో అనుమానితుల్లో కొత్త కొత్త పేర్లు రావడంతో కేసు విచారణపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వైఎస్ సునీత, సౌభాగ్యమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులతో సీబీఐ అధికారులు ఇటీవల భేటీ అయన సందర్భంలో మరి కొన్ని అనుమానితుల పేర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కడపలో ఓ ఆసుపత్రి యజమాని, పులివెందులలో వైఎస్ వివేకా మరణానికి ముందు కారులో వచ్చి వెళ్లిన వారి పేర్లు, రిక్కీ నిర్వహణకు వాహనాలు అద్దెకు ఇచ్చిన వారి పేర్లు కూడా సీబీఐకి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో అనుమానితుల జాబితా పెరుగుతోంది. సీబీఐ విచారణ చేయాల్సిన వారి సంఖ్య పెరుగుతోంది.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

మెరుపుల మేనిఫెస్టో.. వైసీపీ ముహూర్తం సిద్ధం..!