NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి మొదటి ప్రమాద హెచ్చరిక..! కులం పెత్తనంపై అసమ్మతి..!!

156 లక్షల ఓట్లు.., 151 ఎమ్మెల్యేల బలగం.., నీరసించిన ప్రతిపక్షం…! వెరసి వైసీపీ బలం అమాంతం పెరుగుతుంది..!
4 లక్షల ఉద్యోగాల భర్తీ.., గ్రామ సచివాలయాలు.., విరబూస్తున్న సంక్షేమం.. వెరసి జగన్ బలం పీక్స్ కి చేరుతుంది..!!
వీటిని తలచుకుని మురిసిపోతే.. లోపాలు సరిదిద్దుకోకపోతే.. హెచ్చరికలను ఖాతర్ చేయకపోతే… తగలరాని దెబ్బ తగిలేస్తుంది. కోలుకోలేని స్థాయికి తీసుకెళ్తుంది…! పార్టీలోని ఓ ఎమ్మెల్యే ఫోన్ కాల్ (ఆడియో రికార్డ్) వింటే మాత్రం వైసీపీలో అంతర్గత సునామీ హెచ్చరికలను బహిర్గతం చేస్తున్నట్టే ఉంది..!!

అధికార పార్టీలో ఏం జరుగుతుంది..? ఆ ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు..? పాలనపైనా, నాయకులపైనా, జగన్ సామాజికవర్గం పైనా ఏం మాట్లాడుకుంటున్నారు..? మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే “నేను జగన్ బలంతో గెలవలేదు. నా ఖర్చుతో, నా పేరుతో నేను గెలిచాను” అని కుండబద్ధలు కొట్టారు. తాజాగా మరో ఎమ్మెల్యే “పార్టీలో రెడ్డిల పెత్తనం ఎక్కువయింది. ఎస్సీలకు, బీసీలకు ఏం ప్రాధాన్యత లేదు. పవర్ వాళ్ళ దగ్గర ఉంటూ, మనల్ని అణగదొక్కుతున్నారు” అంటూ ఫోన్లో మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే వైసీపీలో “రఘురామ కృష్ణం రాజులు” తక్కువేం కాదు అనేలా ఉంది. కాకపోతే రఘురామకృష్ణం రాజు మాటలు, హావభావాలు చులకనగా మారి.. అతని మాటలని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు అన్నట్టు మార్చేశాయి. కానీ ఈ ఎమ్మెల్యే ఫోన్ కాల్ లో మాత్రం “కుల పెత్తనం, అంతర్గత అంశాలతో ఉంది. ఎస్సీలు, బీసీలకు సంబంధించి సున్నితమైన.., చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి.

ఎమ్మెల్యే శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు..!!

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అందరికీ తెలుసు. ఆ మధ్య ఓ సీఐని బెదిరిస్తూ ఒక ఆడియో బయటకు వచ్చింది. ఇటీవల నియోజకవర్గంలో పేకాట శిబిరాలు నిర్వహణపై మాట్లాడుతూ ఆడియో రికార్డ్ బయటకు రావడంతో అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ వాయిస్ తనది కాదు, మిమిక్రి చేసారు అంటూ ఆమె చెప్పుకున్నారు..! కానీ తాజాగా ఆమె వాయిస్ తో వచ్చిన ఆడియో రికార్డు పార్టీలో సంచలన అంశాలను బయట పెడుతుంది. ఆ రికార్డ్ లో ఉన్న అంశాలు “మనకేం విలువ లేదు అక్కడ. ఎప్పుడైనా మనం (ఎస్సీలు, బీసీలు ఒకటే. ఒకరికి ఒకరం సాయపడాలి. అలా ఉంటేనే గెలుస్తాం. పార్టీలో మనల్ని ఎలా అణగదొక్కాలా..? అనేది చూస్తారు. అందరూ అదే అంటున్నారు. రెడ్డీస్ తో ఎప్పుడైనా డేంజేరె” అంటూ లేళ్ల అప్పిరెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనతో పాటూ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ని కూడా కలుపుకున్నారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. ఈ ఆడియోలో ముఖ్యంగా
* వైసీపీలో కులం మొత్తం ఆధిపత్యం చెలాయిస్తోంది అంటూ పార్టీలో రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యంపైనా ఆమె ఫోకస్ చేసారు. ఒక బీసీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు. పార్టీ అంతర్గత అంశాలను, వివాదాస్పద అంశాలను మాట్లాడారు.


* “ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి నియోజకవర్గం వాళ్ళది” అంటూ కుండబద్ధలు కొట్టారు. పార్టీలో, నియోజకవర్గంలో కీలక నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. మనల్ని పట్టించుకోవడం లేదు” అంటూ జోగి రమేష్ కూడా తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆమె మాట్లాడారు.
* బాపట్ల ఎంపీ సురేష్ పై తన వ్యతిరేకతను మాట్లాడుతూనే.. రెడ్డిలను నమ్మి అతని తిక్క కుదురుతుంది అంటూ సానుభూతి వ్యక్తం చేసారు. “సమావేశంలో పాల్గొనకుండా జగన్ తో దిగిన ఫోటోలు పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని.., పార్లమెంట్ లో కూడా లోపలి వెళ్లకుండా బయట బయట తిరుగుతూ ఫోన్లు మాట్లాడుకుంటాడని..” శ్రీదేవి మాట్లాడిన వాయిస్ రికార్డ్ లో ఉంది.

టీడీపీ తరహాలో కాకుండా జాగ్రత్త పడాల్సిందే..!!

టీడీపీలో కమ్మ సామాజికవర్గ రాజకీయాలు ఎక్కువ. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు నారా లోకేష్, వీవీవీ చౌదరి, టీడీ జనార్దన్, సుజనా చౌదరి, కిలారు రాజేష్ వంటి ఒకే సామాజికవర్గ బ్యాచ్ చక్రం తిప్పింది. చంద్రబాబుకి కోటరీగా జిల్లాల్లో పెత్తనం చేసేవారు. తద్వారా చాల మంది నేతల్లో అసంతృప్తులు గూడుకట్టి.., క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులూ కూడా టీడీపీకి దూరమయ్యారు. ఒక కులం ముద్ర పడిన ఫలితంగా పార్టీ ప్రస్తుతం పేకమేడలా మారిపోయింది. వైసీపీలో ఇప్పటి వరకు అది లేదు. కానీ ఇకపై మాత్రం అప్రమత్తం కావాల్సిన సమయం.
* సీఎం జగన్ కేవలం కొద్దీ మంది నేతలనే కలుస్తున్నారు. కొందరు అసంతృప్తి వాదులను.., ఇటువంటి ఎమ్మెల్యేలకు తమ వాదన వినిపించే అవకాశం, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న బలమైన వాదన.
* జిల్లాల్లో వివాదాలు, ఆరోపణలు అన్నిటినీ సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి నేతల ద్వారా నడిపిస్తున్నారు. దీని వలన సీఎం జగన్ కి ఎమ్మెల్యేలకు, ఇంచార్జిలకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఇది పెరిగి పార్టీపైనా, జగన్ పైనా అభిమానం పోయి.., ఇలా అసంతృప్తి, అసమ్మతి రూపంలో బయటకు వస్తుంది. ఇది ఈ దశలో గుర్తించి సర్దుబాటు చేయకుంటే.., మరింత పెరిగితే.. తేరుకోలేని నష్టం మాత్రం ఖాయం అనేది పార్టీలోనే కొందరి సీనియర్ల వాదన..!!

నోట్ ; ఈ ఆడియోలో అంశాలు, ఈ క్లిప్పింగ్ శ్రీదేవి వాయిస్ అంటూ వ్యాప్తిలో ఉంది. మేము నిర్ధారించడం లేదు. చదివి, విన్న తర్వాత పాఠకులే ఎవరికీ వారు నిర్ణయం తీసుకోగలరు..!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N