NewsOrbit
రాజ‌కీయాలు

రాజు గారి ధైర్యం వెనుక.. !

విసిగించడం..వేపుకుతినడం.. వెటకారం చేయడం, వెర్రితలలు చూపించడం ఇవన్నీ ఆ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. కావాలంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన నోటీసుకు అయన ఇచ్చిన రిప్లై చూడండి..సింపుల్ గా ఫస్ట్ లైన్ లోనే అయన వెటకారం ఎంత ఉందో చూపించారు. రాష్ట్ర పార్టీకి జాతీయ కార్యదర్శి గారికి అంటూ వెటకారంగా విజయసాయిరెడ్డిని సంభోదిస్తూ.. ఇది మీ షోకాజ్ నోటీసుకు రిప్లై మాత్రమే, రెస్పాన్స్ కాదు అని పేర్కొన్నారు. తొలుత వెటకారం ఆలా చూపించిన  ఆయన అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పరోక్షంగా విమర్శలు చేశారు. నాయకుడు అంటే ఎవరయ్యా నాయకుడు, బొచ్చులో నాయకత్వం.. నువ్వు అగు అంటూ పక్కన ఉన్న కార్యకర్తను అని వెర్రి తలను చూపించారు. ఇప్పుడు నేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు, నేను పార్టీని ఏమి దిక్కరించలేదు అంటూ ఇటీవల ఒ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆయనే బొచ్చులో నాయకత్వం అన్నారు, ఆయనే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను విమర్శించారు. ఆయనే ఇప్పుడు వెటకారంగా, వ్యంగ్యంగా విజయసాయి రెడ్డిని అన్నారు. ఇవన్నీ అయన వెర్రితలలకు ఉదాహరణలు.

 

అయన ధైర్యానికి కారణం ఇదే

రఘురామ కృష్ణంరాజుపై వైఎస్ఆర్ సీపీ చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదు. ఒక వేళ చర్యలు తీసుకోవాలంటే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, లేదా అయన ఎంపీ స్థానాన్ని రద్దు చేయాలని లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలి. ఈ రెండింటిలో ఏదయినా రఘు రామ కృష్ణంరాజు దాటెయ్యగలరు. పార్టీ నుండి ఒకవేళ చర్యలు తీసుకోవాలి అంటే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేదా ఆయన ఎంపీ స్థానాన్ని రద్దు చేయాలని లాక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలి. అయితే ఈ రెండింటిని ఆయన సులువుగా దాటెయ్యగలరు. ఒక వేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే చాలా సులువుగామరుసటి క్షణమే ఆయన బిజెపిలో చేరి పొగలరు. ఎందుకంటే ఆయన మూలాలు తొలి నుంచి కూడా బిజెపి లోనే ఉన్నాయి. 2014కు ముందు అయన అనేక సంవత్సరాల పాటు బిజెపిలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ క్షణమైనా బయటకు వెళ్లి బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సో..మొదటి అప్షన్ అంటే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రఘురామకృష్ణంరాజుకు సులువే. ఒకవేళ ఆయన సస్పెండ్ చేయాలి అని చెప్పి లాక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే ఇది కూడా అయన సులువుగా దాటెయ్యగలరు. ఎందుకంటే లాక్ సభ స్పీకర్ బీజేపీ వ్యక్తి. కాబట్టి బీజేపీ నిర్ణయం తీసుకోకుండా, మోదీ, అమిత్ షా, నడ్డాల అనుమతి లేకుండా అక్కడ స్పీకర్ అంత ఈజీగా నిర్ణయం తీసుకోరు. వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. దీనితో రఘు రామ కృష్ణంరాజు ఎంపీగానూ సేఫ్. ఎలాగో ఇంత సేఫ్ గా ఉన్నారు కాబట్టి అయన తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు. అయన వెర్రి తలలు, వెటకారాన్ని చూపిస్తూ పార్టీని ఒక రకంగా ఆడుకుంటున్నారన్నమాట. వైఎస్ఆర్సీపీకి ఆయనే ఒక పెద్ద తలనొప్పి. ఎన్ని రకాల మెడిసిన్ వాడినా సరే, ఎన్ని రకాల అయిల్స్ తలకు రాసుకున్నా సరే తొలగని తలనొప్పి ఆ రాజుగారే. ఎందుకంటే అయనకు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. సో..అయన పిచ్చోడు, ఇష్టం వచ్చినట్లు  మాట్లాడతాడు అని చూసి చూడనట్లు వెళతారా?లేదంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? లేదా లాక్ సభ స్పీకర్ కు పిర్యాదు చేసి గట్టిగా పట్టుపడతారా లేదా న్యాయపరంగా ఎదుర్కొంటారా? ఏమిచేయబోతున్నది పార్టీ అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా రఘు రామ కృష్ణంరాజు ధైర్యానికి మాత్రం కారణం అదే. తెర వెనుక, తెర ముందు బీజేపీ ఉండటమే. అయన ధైర్యమే బీజేపీ.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?