NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విశాఖ వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాజీనామా

YSRCP: విశాఖ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నందుకు బాధగా ఉందంటూనే పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానన్నారు. అందుకు క్షమించాలని  వేడుకున్నారు. ఏడాది కాలంగా అనేక సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించాననీ, కానీ వీలు కాలేదన్నారు. ప్రజా సమస్యలు, కింద స్థాయిలో తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు అంటే స్వేచ్చయుత పరిస్థితులు ఇవ్వలేదన్నారు. చాలా వరకు ఘాటుగా విమర్శించడం తనకు రాదని అన్నారు. సామాజికవర్గ మీటింగ్ లు పెట్టొద్దని పార్టీ ఆదేశించిందన్నారు. తనకూ టీటీడీ చైర్మన్,  పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తన అనుచరులతో త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు రమేష్ బాబు.

పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలి సారిగా ఎమ్మెల్యేగా  ఎన్నికైయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ తో పాటు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎలమంచిలి నుండి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రమేష్ బాబు ఎలమంచిలి నుండి పోటీ చేసి .. వైసీపీ అభ్యర్ధి కన్నబాబు చేతిలో పరాజయం పాలైయ్యారు. ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ అధ్యక్ష పదివికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 2020 లో టీడీపీ రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

సీనియర్ నేత కావడంతో వైసీపీ ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. పెందుర్తి అసెంబ్లీ సీటు విషయంలో పంచకర్ల అసంతృప్తితో ఉన్నారు. కొంత కాలంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ టార్గెట్ గా విమర్శలు చేస్తూ పెందుర్తి రేసులో తాను ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు అసంతృప్తి కల్గించాయి. రీసెంట్ గా పెందుర్తిలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి .. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను పెందుర్తిలో మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీంతో ఆ సీటు ఆశిస్తున్న పంచకర్ల రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు.  

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju