Anushka: హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుండి హీరోయిన్ గా సత్తా చాటుతోంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2005వ సంవత్సరంలో.. “సూపర్” అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన “విక్రమార్కుడు” తో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. “అరుంధతి” సినిమాతో నటిగా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయి ఇమేజ్ సంపాదించింది. చాలామంది టాప్ హీరోల సరసన నటించిన అనుష్క “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సరైన విజయం వరించలేదు.
దీంతో ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ప్రజెంట్ అనుష్క… నవీన్ పోలిశెట్టి జంటగా “మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 4వ తారీఖు విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనకు తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి ఓసారి కొత్త వార్త నెట్టీంట వైరల్ అవుతూ ఉంది.
మేటర్ లోకి వెళ్తే తెలుగు సినిమా రంగంలో సీనియర్ దర్శకుడు ఒకరు అనుష్కని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని.. తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె ముందు పెళ్లి ప్రపోజ్ పెట్టడం జరిగిందట. అయితే ఈ ప్రపోజల్ నీ అనుష్క తిరస్కరించిందట. తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చిందట. దీంతో ఆ సీనియర్ దర్శకుడు తన కొడుక్కి ముంబాయికి చెందిన అమ్మాయితో ఘనంగా పెళ్లి చేయించారట. ఆ రకంగా అనుష్క సినిమా ఇండస్ట్రీలో మంచి పిక్స్ లో ఉన్న సమయంలో సీనియర్ దర్శకుడు ఇంటికి కోడలిగా వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం జరిగిందంట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!