Chakra Review : తమిళ స్టార్ విశాల్ హీరోగా నటించిన ‘చక్ర‘ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎం ఎస్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసాండ్రా విశాల్ సరసన నటించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందు కొన్ని లీగల్ పరమైన ఇబ్బందులు తలెత్తినా ప్రొడ్యూసర్లు చివరికి ఎలాగోలాగా సినిమాను విడుదల అయ్యేలా చూశారు.
Chakra Review : కథ
చంద్రు (విశాల్) ఇండియన్ ఆర్మీ ని వదిలేసి సొంత ఊరికి వస్తాడు. అతని నాన్న కు చెందిన అశోకచక్ర మెడల్ దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు అతను ఆర్మీ వదిలి రావాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో నగరంలో ఇలాంటివి మరొక 50 దొంగతనాలు జరగడంతో చంద్రు గాయత్రి (శ్రద్ధా శ్రీనాథ్) అనే ఒక పోలీస్ ఆఫీసర్ తో చేతులు కలిపి ఈ కేసులన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. దీని వెనుక ఎవరో ఉన్నారని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో వారికి కొన్ని విస్తుగొలిపే విషయాలు తెలుస్తాయి. ఇక చివరికి వారికి ఈ చోరీల వెనక ఎవరున్నారో తెలిసిందా? వారిని పట్టుకోగలిగారా? అన్నది మిగిలిన సినిమా.
ప్లస్ లు
విశాల్, రెజీనా కసాండ్రా ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరిద్దరూ నటన పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఈ సినిమాలోని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు అన్నీ చాలా బాగున్నాయి. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా వాటిని తెరక్కించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా బాగా తీశారు.
ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకి మూలం అని చెప్పాలి. అలాగే ప్రీ క్లైమాక్స్ భాగం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చాలా బాగున్నాయి. థ్రిల్లర్ సినిమాకి అవసరమైన మ్యూజిక్ తో పాటు సైబర్ క్రైమ్ నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో విజువల్స్ ప్రధానం కాబట్టి ఆ రెండిటి పై బాగా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించింది.
మైనస్ లు
సైబర్ క్రైమ్ అనే అంశాన్ని తీసుకున్నప్పుడు దాన్ని లోతుగా విశ్లేషించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంది కీ పాయింట్.
సినిమాలో అసలు ఎమోషనల్ కనెక్టివిటీ అనేదే లేదు. సినిమా మొత్తం టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ అనే అంశాల పైన తిరుగుతుంది కానీ ఎమోషన్స్ కు ఇక్కడ చోటు లేకుండా పోయింది.
పోలీసు, సైబర్ క్రైమ్ మ్ ఆస్టర్ మైండ్ మధ్య ఉండే సన్నివేశాలు మనం చాలా సినిమాల్లో చూశాం. అంతేకాకుండా క్లైమాక్స్ కూడా బాగా వీక్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ సన్నివేశాలను మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కించవచ్చు.
Chakra Review : విశ్లేషణ
ఒక సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశం తీసుకున్నప్పుడు అందులోని మెయిన్ పాయింట్ మీదే పూర్తిగా, లోతుగా ఫోకస్ చేయాలి. దాని చుట్టూ కథ తిరగాలి. అయితే చక్ర సినిమాలో మాత్రం అది జరగలేదు. పైగా ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు అంతా టచింగ్ గా లేవు. ఇక సినిమాలో అక్కడక్కడ మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో థ్రిల్ జనరేటర్ చేయడంలో విఫలమయ్యారు. సినిమా కి ఎలివేషన్ అవసరమైన సమయంలో పూర్తిగా పడిపోవడం కూడా అతి పెద్ద మైనస్. విశాల్ ఈ రకమైన చిత్రాలను ఈ మధ్య బాగా చేస్తుండటం కూడా కొద్దిగా బోర్ కొట్టించే అంశం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!