ఈ మధ్యకాలంలో చిన్న బడ్జెట్ సినిమాల హవా ఎక్కువైపోయింది. కంటెంట్ బాగా ఉంటే చాలు… బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు కూడా వెనకాడటం లేదు. ఇప్పుడు తాజాగా ఒక కొత్త స్టోరీ తో ‘క్రేజీ అంకుల్స్’ సినిమరాబోతున్నట్లు తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
ఈ చిత్రం ట్రెయిలర్ విషయానికి వస్తే బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మనో, రాజారవీంద్ర, భరణి ముగ్గురు అంకుల్స్ గా నటించారు. తమ భార్యలతో వారి సంసార జీవితం సుఖంగా లేదని వీరు ముగ్గురు అనుకోకుండా తమ అపార్ట్మెంట్ లోనికి వచ్చిన సెలబ్రిటీ అయిన శ్రీముఖి ను ఇంప్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తమదైన శైలిలో ఆమెన్ ఇంప్రెస్ చేసేందుకు విపరీతంగా ట్రై చేస్తుంటారు. ఆమె కోసం వీరు ముగ్గురూ చేసే చేష్టలు వారి వయస్సుకు సంబంధం లేకుండా కొద్దిగా వికృతంగా ఉండి ఫన్నీ ఉంటాయని ట్రైలర్లో అర్థమైంది.
అంతేకాకుండా ఒక సెలబ్రిటీ కి ఆమె చేస్తున్న ప్రొఫెషన్ లో వచ్చే ఆదాయం కంటే కూడా సైడ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందని క్యారెక్టర్ జడ్జ్ చేసే వారి మధ్య గేటెడ్ కమ్యూనిటీ లో శ్రీముఖి ఉంటుంది. అయినా ఈ అంకుల్స్ ఆమెతో సమయం గడిపేందుకు వీలుంటే ఆమెతో ప్రేమాయణం సాగించి ఎందుకు నానా పాట్లు పడుతుంటారు. మొత్తానికి ట్రైలర్లో పెద్దగా పంచ్ కు లేకపోయినా ముగ్గురు మిడిల్ ఏజ్ అంకుల్స్ ఒక సెలబ్రిటీ పైన మనసు పారేసుకోవడం…. ఒకరితో ఒకరు పోటీ పడటం వంటివి ఒక రకంగా ఫన్ క్రియేట్ చేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద సినిమాల మధ్య ఏ మాత్రం నిలుస్తుందో చూడాలి.
సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి కథ రచించి డైలాగులు సమకూర్చారు గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్, బొడ్డు అశోక్ నిర్మాతలుగా వ్యవహరించారు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే బాణీలు సమకూర్చారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!