NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Agent Review: మాస్ హీరోగా రుజువు చేసుకునే ప్రయత్నంలో అఖిల్ “ఏజెంట్” ఎలా ఉందంటే..?

Share

Agent Review: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన పోకిరి, బాహుబలి సినిమాలు  విడుదల తేదీ ఏప్రిల్ 28వ తారీకు నాడే “ఏజెంట్” విడుదల కావడంతో… ఈ సినిమాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి.

నటీనటులు : అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, భరత్ రెడ్డి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు
కథ : వక్కంతం వంశీ
మాటలు : భార్గవ్ కార్తీక్
ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్
సంగీతం : హిప్ హాప్ తమిళ, భీమ్స్ (వైల్డ్ సాలా సాంగ్)
నిర్మాత : రామబ్రహ్మాం సుంకర
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023

How Akhil is an agent trying to prove himself as a mass hero

పరిచయం:

అక్కినేని ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మాత్రమే నిలదొక్కుకోగలిగారు. అయితే అక్కినేని అఖిల్ నాగార్జున వారసుడిగా ఆల్ రౌండర్ గా… అన్ని టాలెంట్స్ ఉన్నాగాని మాస్ హీరోగా ఇమేజ్ సంపాదించుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నారు. డాన్స్ పరంగా ఇంకా ఫైట్స్ పరంగా తిరుగులేని టాలెంట్ ఉన్నా గానీ సరైన విజయం ఇప్పటివరకు పలకరించలేదు. మాస్ హీరోగా రుజువు చేసుకోవడానికి అఖిల్ ఈ “ఏజెంట్” మూవీ ద్వారా తన బాడీ షేప్ పూర్తిగా మార్చడం జరిగింది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో స్టైలిష్ టేకింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. హాలీవుడ్ రేంజ్ లో తెలుగు సినిమా చేయటం జరిగింది. అంతేకాదు ఇప్పటివరకు ఏ తెలుగు హీరో చేయని స్టంట్స్ ఈ సినిమా ద్వారా అఖిల్ చేయడం జరిగింది. సినిమా టీజర్ మరియు ట్రైలర్ అంచనాలను పెంచేశారు. నేడు ప్రేక్షకులను అలరించడానికి విడుదలైన… “ఏజెంట్” సినిమా.. ఎలా ఉందో తెలుసుకుందాం.

 

స్టోరీ:

 

రీసెర్చ్ అనాలసిస్ వింగ్(RAW) కు హెడ్ గా మహదేవ్ (మమ్ముట్టి) పనిచేస్తుంటాడు. చాలా సిన్సియర్ ఆఫీసర్. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయాలని.. చాలా నిజాయితీగా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అవసరమైతే దేశం కోసం ఏజెంట్స్ కూడా చనిపోవాలని చెబుతూ ఉంటాడు. అటువంటి నిజాయితీ గల అధికారి అయిన మహాదేవ్ కి గాడ్ (డీనో మోరియా)..తో గొడవలు అవుతూ ఉంటాయి. ఇండియాని నాశనం చేయడానికి… చైనాతో కలిసి గాడ్ అనే వ్యక్తి కుట్రకు పాల్పడతాడు. అయితే రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) ఓ మధ్యతరగతి కుర్రోడు. స్పై అవ్వటమే లక్ష్యంగా జీవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో “రా”లో చేరెందుకు మూడుసార్లు పరీక్ష రాస్తాడు. కానీ ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇలా చేస్తే లాభం లేదనుకొని ఏదోరకంగా “రా” ఏజెంట్ అవ్వాలని హ్యాకింగ్ నైపుణ్యాలతో…”రా” డిపార్ట్మెంట్ చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ కంప్యూటర్ హ్యాక్ చేసి… అతని దృష్టిలో పడాలని.. ప్రయత్నం చేస్తాడు. అయినా గాని మహాదేవ్… రిక్కీ చేసే కోతి చేష్టలను పెద్దగా పట్టించుకోడు. ఇదిలా ఉంటే… చైనా దేశంతో చేతులు కలిపి ఇండియాని నాశనం చేయడానికి గాడ్ కుట్రను ఛేదించి మిషన్ రాబిట్ ను అడ్డుకునేందుకు మహాదేవ్ ఉన్నట్టుండి రిక్కీని రంగంలోకి దింపడం జరుగుద్ది. ఈ క్రమంలో అసలు “రా” పరీక్షలలో ఫెయిల్ అయిన రిక్కీని మహదేవ్ ఎలా ఈ ఆపరేషన్ లో ఎలా ఇన్వాల్వ్ చేశాడు..? మహాదేవ్ ఆదేశాలను ఈ ఆపరేషన్ లో రీక్కీ పాటించాడా లేదా..? మిషన్ రాబిట్ ను ఎలా అడ్డుకున్నాడు..? అనేది సినిమా చూడాల్సిందే.

How Akhil is an agent trying to prove himself as a mass hero

విశ్లేషణ:

సాధారణంగా గూడచారి సినిమాలంటే దేశాన్ని నాశనం చేసే… శత్రు పన్నాగాల నుండి నుండి కాపాడే స్టోరీ లైన్. అదే తరహాలో “ఏజెంట్” నీ చూపించడం జరిగింది. సినిమా కథ మొత్తం ముగ్గురు “రా” ఏజెంట్ల చుట్టూ సాగుతోంది. అందులో ఒకరు దేశాన్ని నాశనం చేయాలని కుట్రతో… పనిచేసే లక్ష్యంతో ఉంటే మరో ఇద్దరూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేసేవాళ్లు. దాదాపు ఇటీవల షారుక్ ఖాన్ నటించిన “పఠాన్” సినిమాకి చాలా దగ్గరగా ఉన్న కథంశం. దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ త్రిల్లర్ అనే చిన్న స్టోరీ లైన్ లాగా ఉన్నదాని సినిమాలో యాక్షన్ త్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాస్ కోణంలో అఖిల్ నీ చూడాలనుకునే అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలలో అఖిల్ పడ్డ కష్టం లేయర్ కట్టగా కనిపిస్తూ ఉంటది. సిక్స్ ప్యాక్ తో .. మెస్పరైజ్ చేసాడు. హీరోయిన్ సాక్షి వైద్య రోల్ కి సినిమాలో పెద్దలు ఆస్కారం లేదు. 20 నిమిషాలకు మించి ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. చాలావరకు పాటలకే పరిమితం అయింది. మమ్ముట్టి నటించిన మహాదేవ్ పాత్ర కథలో చాలా హైలెట్ గా నిలిచింది. దేశభక్తుడిగా…”రా” కోసం ప్రాణ త్యాగం చేసే హెడ్ గా చాలా అద్భుతంగా చూపించారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎప్పటిలాగే సినిమాని చాలా స్టైలిష్ గా… తన పంతాలో తెరకెక్కించారు. స్టోరీని నడిపించిన విధానం ఒకలా ఉంటే దానికి మించిన భారీ యాక్షన్ సన్నివేశాలు… నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో సినిమా ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎటు వెళ్తుందో అయోమయం చూసే ప్రేక్షకులలో నెలకొంది. పాటలు ఇంకా.. దేశభక్తికి తగ్గ సీరియస్ నైస్ మహాదేవ్ పాత్రలో మినహా… కథలో లేదు. మిగతా పాత్రలో అలా వచ్చి వెళుతూ ఉంటాయి. సినిమాలో మూడు నాలుగు పాత్రలకు మినహా మిగతా వాటికి పెద్దగా స్కోప్ కనబడదు.

ప్లస్ పాయింట్స్:

యాక్షన్ సీన్స్
ఫస్టాఫ్
మమ్ముట్టి
సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్:

క్లైమాక్స్
విలన్ పాత్ర
సెకండ్ హాఫ్

చివరిగా: యాక్షన్ ఎక్కువైపోయి ఫెయిల్ అయిన “ఏజెంట్”.

Share

Related posts

Ananya Panday: స్విమ్మింగ్ పూల్‌లో `లైగ‌ర్‌` బ్యూటీ బికినీ ట్రీట్‌.. పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

kavya N

Bheemla Naayak: అందరూ.. ఒకటైతే మీరు వేరు సార్ పవన్ పై రానా పొగడ్తలు..!!

sekhar

RRR: “ఆర్ఆర్ఆర్” పై డైరెక్టర్ శంకర్ అదిరిపోయే రియాక్షన్..!!

sekhar