25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
Entertainment News రివ్యూలు

Iravatham Review : OTT లో ‘ఐరావతం’ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఇదొక పెద్ద అవమానం.

Iravatham OTT Movie Review
Share

Iravatham Review : ఎస్తేర్ నొరోన్హా (Ester Noronha) ముఖ్య పాత్ర పోషిస్తూ, అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary), తన్వి నెగి (Tanvi Negi), సప్తగిరి (Sapthagiri), రాజా రవీంద్ర (రాజా రవీంద్ర) నటించిన సినిమా ‘ఐరావతం’ OTT లో నవంబర్ 17, 2022న విడుదల అయింది. ‘ఐరావతం’ సినిమా ఇప్పుడు మీరు డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకుని చూడవొచ్చు

Iravatham Review: iravatham is now available for streaming on OTT Disney+ Hotstar from November 17
Iravatham Review: iravatham is now available for streaming on OTT Disney+ Hotstar from November 17

Iravatham Review: OTT లో ‘ఐరావతం’ రివ్యూ: క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఇదొక పెద్ద అవమానం

అయితే 2 గంటల మీ విలువైన సమయాన్ని ఈ సినిమా మీద వెచ్చించటం వృధా అనే చెప్పాలి, ఎందుకంటే ‘ఐరావతం’ సినిమా అలా ఉంది మరి. ఎందుకో ఈ ‘ఐరావతం’ రివ్యూ చదివి మీరే తెలుసుకోండి

Iravatham Review: మొదట ‘ఐరావతం’ కథలోకి వెళ్తే

సుహాస్ మీరా (Suhaas Meera) దర్శకత్వం వహించిన సినిమా ‘ఐరావతం’. డైరెక్టర్ గా ఐరావతం సినిమా తో రంగప్రవేశం చేసిన సుహాస్ మీరాకు నిరాశే మిగిలింది. నవంబర్ 17న OTT లో విడుదలైన ఐరావతం (Iravatham) చాలావరకు నెగెటివ్ రివ్యూలు తెచ్చుకుంది. అందుకు ప్రధాన కారణం సినిమా కథ గ్రిప్పింగ్ గా లేక పోవటమే.

ఐరావతం (Iravatham) లో లీడ్ హీరోయిన్ పాత్ర శ్లోక( తన్వి నెగి ) తన ప్రియుడు ద్వారా ఒక కెమెరాని గిఫ్ట్ కింద పొందుతుంది. ఆ తరువాత సినిమా మొత్తం ఈ కెమెరా చుట్టూనే ఉంటుంది. ఈ కెమెరాలో వీడియో రికార్డు చేసిన శ్లోకకి ఆశ్చర్యం కలిగేలా వీడియోలో తన బదులు మరొక అమ్మాయి కనపడుతుంది. ఈ రెండో అమ్మాయి ఎవరు, తను అచ్చు శ్లోక లాగే ఎందుకు ఉంది, ఆ అమ్మాయి హత్య చేయబడిందా, సీరియల్ కిల్లర్ ఉన్నాడా, ఏ అంశాలన్నీ స్టోరీ ప్లాట్ లో భాగం.

సైకలాజికల్ థ్రిల్లర్/ మిస్టరీ అనే టాగ్ తో విడుదలైన ఐరావతం సినిమా ఆ జానర్‌కు జరిగిన ఒక పెద్ద అవమానం. సీరియల్ కిల్లర్ అయిన పాత్రలో అసలు ఆకట్టుకొనే విషయాలే లేవు. ఎంతో తెలివిగా ఉండవలసిన పాత్రా పేలగా ఉండటంతో పాటు పోలీసులతో జరిగే సన్నివేశాలలో అసలు మసాలానే లేదు.

ఇంక నటీ నటుల విషయానికి వొస్తే, సినిమా కథ ఎంత పేలగా ఉందొ ఐరావతం సినిమాలో నటన కూడా అంతే పేలగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో సినిమా ఆపేసి ఇంకేదైనా పని చేసుకోవాలని అనిపించటం కాయం. కామెడీ సీన్స్ కోసం సప్తగిరిని పెట్టుకున్నారు కానీ, ఒక్క కామెడీ సీన్ కూడా మిమ్మల్ని నవ్వించదు. టెలిపతి, దివ్యదృష్టి ఇలాంటివి సినిమా లో ఉన్నపటికీ అవి ఈ సినిమాని కాపాడలేవు.

Iravatham Review: iravatham is now available for streaming on OTT Disney+ Hotstar from November 17
Iravatham Review: iravatham is now available for streaming on OTT Disney+ Hotstar from November 17

‘ఐరావతం’ రివ్యూ ఫైనల్

ఈ సినిమా కి అసలు రేటింగ్ ఇవ్వడమే దండగ కానీ 0 ఇవ్వలేం కనుక న్యూస్ ఆర్బిట్ నుండి మేము ఇచ్చే రేటింగ్ 0.5/5

Iravatham Review: Iravatham on Disney+ Hotstar is a disgrace to the genre of Crime Thriller/ Mistry, Iravatham movie gets a rating of 0.5/5 star from NewsOrbit.

 

 


Share

Related posts

మెగాస్టార్ బర్త్ డేకి ఒకరోజు ముందే బోలా శంకర్ అప్ డేట్..!!

sekhar

`థ్యాంక్యూ` క‌లెక్ష‌న్స్‌.. 2వ రోజు మ‌రీ దారుణం!

kavya N

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్లిన దయానంద్ కుటుంబం..

bharani jella