NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Hi Nanna Review: తండ్రి కూతురు ఎమోషనల్ బాండింగ్ కథతో న్యాచురల్ స్టార్ నాని.. “హాయ్ నాన్న” సినిమా రివ్యూ..!!

Hi Nanna Review: “దసరా” సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలో న్యాచురల్ స్టార్ నాని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి ఫ్యామిలీ ఎమోషనల్ తరహాలో “హాయ్ నాని” అనే సినిమా చేయడం జరిగింది. “సీతారామం” ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 7వ తారీకు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. “హాయ్ నాన్న” సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

చిత్రం: హాయ్‌ నాన్న;
నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు;
సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌;
నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల,
రచన, దర్శకత్వం: శౌర్యువ్;
సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Natural star Nani with father daughter emotional bonding story Hi Nanna Movie Review
పరిచయం:

న్యాచురల్ స్టార్ నాని గత కొన్నాళ్ల నుండి రెగ్యులర్ పంతా నుండి మాస్ ఇమేజ్ సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో “దసరా” అనే సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మాస్ ఇమేజ్ ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు బోల్తా కూడా పడటం జరిగింది. చాలా వరకు నాని సినిమాలు ఫీల్ గుడ్ తరహాలో న్యాచురల్ గా.. మధ్యతరగతి ప్రజలను టచ్ చేసే విధంగా ఉంటాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే నాని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి అదే పంతాలోకి వచ్చేసి.. “హాయ్ నాన్న” అనే సినిమా చేయడం జరిగింది. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం జరిగింది.” సీతారామం” సినిమాతో బాగా ఆకట్టుకున్నటువంటి మృణాల్ ఠాకూర్… ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈ సినిమా టైటిల్ నుంచి సాంగ్స్ మరియు ట్రైలర్ అన్ని చూసుకుంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ముందుగానే.. తెలిసిపోతుంది. డిసెంబర్ 7వ తారీకు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Natural star Nani with father daughter emotional bonding story Hi Nanna Movie Review

స్టోరీ:

ముంబైలో వీరాజ్ (నాని) అనే ఫేమస్ ఫోటోగ్రాఫర్ స్టూడియో నడుపుతుంటాడు. ముంబైలో చాలామంది సెలబ్రిటీలకు మోస్ట్ వాంటెడ్ ఫోటోగ్రాఫర్. వీరాజ్ కి మహి(కియారా) అనే కూతురు ఉంటుంది. ఆ కూతురికి చిన్ననాటి నుంచి వ్యాధి ఉంటుంది. తండ్రి కూతురుతో పాటు మహి తాత కూడా ఒకే చోట ఉంటారు. మహి ఎప్పుడు తనకి తల్లి కావాలి అని మారం చేస్తూ ఉంటది. ఈ క్రమంలో వీర్రాజు అనేక కథలు చెబుతూ ఉంటాడు. ఆ కథలలో అమ్మ లేకుండానే చాలా వరకు జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయితే ఒకసారి మహి ఖచ్చితంగా అమ్మ కథ చెప్పాలని.. ఏడుస్తది. ఈ క్రమంలో వీరాజ్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అమ్మ కథ చెబుతానని మహికి మాట ఇస్తాడు. పరీక్షలలో మహి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తది. కానీ వీరాజ్ అమ్మ కథ చెప్పడు. దీంతో కోపం వచ్చిన మహి ఇల్లు వదిలి బయటికి వెళ్లిపోతున్న సమయంలో ఒక ప్రమాదం సంభవిస్తూ ఉండగా.. యశ్నా (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడటం జరుగుద్ది. ఈ క్రమంలో కూతురు తప్పిపోయిందని ఊరంతా వెతుక్కుంటున్న వీరజ్ కి యశ్నా.. సమాచారం ఇచ్చి ఫలానాచోట ఉన్నామని పాపను పటుకేలండి అని తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా అమ్మ కథ చెప్పాలని మహి.. మారం చేయటంతో వీరాజ్ చెప్పటం స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలో తల్లిగా ఎవరిని ఊహించుకోవాలని మహి అనగా…పక్కనే ఉన్న యశ్నా.. తనని ఊహించుకోమని అంటది. ఆ రకంగా యశ్నా… వీరాజ్ భార్యగా కథగా వస్తది. మరి ఈ కథలో ఈ ఇద్దరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అసలు వీరాజ్ భార్య ఎవరు..? వర్షాకు ఈ కథకు సంబంధం ఏమిటి..? ఆ కథలో ఈ పాపను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది..? వీరాజ్ భార్యా అసలు ఎందుకు కుటుంబానికి దూరమైంది..? యశ్నా వచ్చాక వీరాజ్ లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనలేంటి అనేవి సినిమా చూడాల్సిందే.

Natural star Nani with father daughter emotional bonding story Hi Nanna Movie Review

విశ్లేషణ:

తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన స్టోరీ ఇది. ఈ జోనర్ తరహా కథలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలానే వచ్చాయి. కానీ “హాయ్ నాన్న” సినిమాలో అమ్మానాన్నల ప్రేమ కథలో చాలా మలుపులు ఉంటాయి. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు సన్నివేశాలు చాలా ఎక్కువ. ఫ్యామిలీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో.. స్క్రీన్ ప్లే చాలా కీలకము. అయితే డైరెక్టర్ శౌర్వువ్ ఈ విషయంలో కాస్త స్లోగా సినిమా నడిపించాడు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందో అనేది ప్రేక్షకుడు ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఫస్టాఫ్ లో చాలా సాగదీత సన్నివేశాలు ఉన్నట్టు ఫీల్ కలుగుద్ది. మృణాల్ మరియు నాని నటనతో.. సినిమాని నడిపించిన గాని చాలా బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా కథకి మూలమైన వీరాజ్ మరియు వర్షా లవ్ స్టోరీ చాలా సాధారణంగా ఉంటుంది. వర్షా కథ విని యశ్నా..వీరాజ్ తో ప్రేమలో పడటం విడిపోవడం అంతా కూడా చాలా సాధారణంగా రొటీన్ తరహాలోనే అనుభూతిని కలిగిస్తుంది. తండ్రి కూతుళ్లు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ అనిపిస్తాయి. సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు కొద్దిగా ట్విస్టులు.. ప్రేక్షకుడికి కొంత ఎంటర్టైన్మెంట్ అందించినట్లు ఉంటది. హీరో హీరోయిన్ లతో పాటు కియారా నటన చూడముచ్చటగా ఉంటుంది. యధావిధిగా నాని తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేశాడు. మృణాల్.. నానితో కెమిస్ట్రీ సన్నివేశాలలో ఇంకా ప్రీ క్లైమాక్స్ లో.. తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి, జయరాం, వీరాజ్ ఆశ్విన్ తదితరులు కీలకమైన పాత్రలలో నటించి పరవాలేదు అనిపించారు. స్టోరీ కి తగ్గ విజువల్స్ మరియు టెక్నికల్ గా కూడా పరవాలేదు అనిపించింది. డైరెక్టర్ శౌర్యవ్ కి మొదటి సినిమా అయినా గాని చాలా లోతైన కథని.. ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నం శభాష్ అని చెప్పవచ్చు. తెలిసిన కథ లాగా ఉంటుంది కానీ భావోద్వేగాలకు పెద్దపీట వేయడం జరిగింది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu