NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవేళ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులకు ఆహ్వానాలు పంపారు. అయితే వీరు ప్రమాణ స్వీకారానికి హజరు కాలేదు కానీ, ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసిన సీఎం వైఎస్ జగన్.. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా రేవంత్ కు అభినందనలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు కూడా రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేవంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ పాల్గొన్నారనీ, అంతే కాకుండా .. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని గుర్తు చేశారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కల్గిన ఆయన.. రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.

తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యంపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ అని పవన్ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ.. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం అత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్ధకతను కల్పించాలని,రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి తో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ కి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N