తెలుగులో పెద్ద బడ్జెట్ తో, క్వాలిటీ కంటెంట్ తో వెబ్ సిరీస్ లో రావడం చాలా అరుదు. ఇక జి-5 లో గాడ్స్ ఆఫ్ ధర్మపురి తర్వాత ఆ రేంజ్ వెబ్ సిరీస్ తెలుగులో మళ్లీ రాలేదు. మళ్లీ ఎక్కువ ప్రొడక్షన్ తో జీ 5 లోనే వచ్చిన వెబ్ సిరీస్ షూట్ అవుట్ ఎట్ ఆలైర్. శ్రీకాంత్, సంపత్ రాజ్, ప్రకాష్ రాజ్ వంటి ప్రధాన తారాగణంగా నటించిన ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం…
కథ
యుక్తవయస్సులో బాగా రెబల్ గా ఉండే అక్తర్, అతని స్నేహితుడు నజీర్ కాలేజీ నుండి వచ్చేసిన తర్వాత కొన్ని దురదృష్టకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అదే సమయంలో మక్కా మసీదు పేలుళ్లు జరిగితే వారు తమ మతం పైన ఈ దేశం అంతా కుట్రపన్నుతోందని ప్రతీకారానికి బయలుదేరుతారు. అలా తాము కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అని పోలీసులు చంపేయడం… మక్కా మసీదు జరిగిన రోజే వరుస ఏడాదులలో హింసాకాండ చేయడం వంటివి చేస్తుంటారు. అలాగే గుజరాత్ సీఎం ను చంపేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత 2019లో కానిస్టేబుల్ నానాజీ… అప్పుడు అక్తర్, అతని గ్యాంగ్ ఎలా అయితే మార్దర్లు చేసే చేశారో అలాగే చనిపోవడంతో ప్రవీణ్ టీం అనుమానం వస్తుంది. అక్తర్ రికార్డును మళ్ళీ తీస్తారు. అసలు అక్తర్ చనిపోయాడా బతికే ఉన్నాడా..? లేదా అతనిని చూసి వేరొకరు ఇన్స్పైర్ అయి ఇలా చేస్తున్నారా అన్నది ఈ వెబ్ సిరీస్ కథ
ప్లస్ లు
నటీనటుల్లో మంచి పర్ఫార్మెన్స్
బలమైన కథ
థ్రిల్లర్ కు అవసరమైన డీటెయిలింగ్ ఉండడం
మైనస్ లు
స్క్రీన్ ప్లే
కథలోనికి ఎంటర్ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం
ఒక్కో క్యారెక్టర్ గురించి లోతుగా ప్రస్తావించకపోవడం
విశ్లేషణ
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నిజంగా పనిచేస్తే ఎలా ఉంటది అన్నది ఈ వెబ్ సిరీస్ లో మనం చూడొచ్చు పోలీసులు ఎంత హీరోయిజం చూపిస్తారో అలాగే చనిపోవడానికి కూడా వారే చాలా ఈజీ టార్గెట్ అని చెప్పడం జరిగింది. ఇక ఈ చిత్రం లో ఎన్నో రీజనల్ అంశాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి… కానిస్టేబుల్స్ మధ్య కెమిస్ట్రీ… మతం ఒకి బానిస అయిపోతే అందువల్ల జరిగే విపరీతమైన పరిణామాలు చాలా చక్కగా చూపించారు. అయితే షోలో అక్తర్ ప్రధాన లక్ష్యాలను ప్రేక్షకులకు చెప్పడంలో విఫలం అయ్యారు. అతను హింసాకాండ చేస్తాడు కానీ అందుకు తగిన కారణాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు. అంతే కాకుండా కొన్ని సార్లు డైలాగులు కూడా పొంతన లేకుండా ఉంటాయి. ఇక చంపే ప్లాన్ల విషయానికి వస్తే పెద్ద స్ట్రాటజీ లేకుండా చాలా సింపుల్గా అయిపోతాయి. అక్తర్, నాఫీసా ల లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఇక క్యారెక్టర్లకు ఫ్లాష్ బ్యాక్ లు పెట్టి వారి గురించి మరింత ప్రేక్షకులకు తెలిసేలా చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. మొత్తానికి ఫైనల్ ఎపిసోడ్స్ వచ్చేసరికి కథ మంచి రసకందాయంలో పడుతుంది కానీ కొన్ని ఎపిసోడ్స్ మాత్రం డాక్యుమెంటరీ చూసినట్లు ఉంటాయి. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ సిరీస్ ను తమ భుజాలపై మోశారు అనే చెప్పాలి. మొత్తానికి ఈ తెలుగు బిగ్ వెబ్ సిరీస్ పర్వాలేదనిపించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!