తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చెరువుల పండుగ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగ్ రూరల్ మండలం అసిఫానగర్ ఊర చెరువు వద్ద చెరువు పండుగ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగులను పడవ ఎక్కాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. కార్యకర్తల విజ్ఞప్తిపై ఆయన నాటు పడవ ఎక్కే ప్రయత్నం చేయగా, పడవ ఒక వైపు ఒరిగిపోయి బోల్తా పడింది.

దీనితో గంగుల నీళ్లలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ పరిణామంతో ఒక్క సారిగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. పరిమితికి మంచి ఎక్కువ మంది నాటు పడవ ఎక్కడం, ఒక వైపు ఎక్కువ మంది ఉండటంతో పడవ బొల్తా పడిందని భావిస్తున్నారు. మంత్రి గంగుల పడవ ప్రమాదం నుండి బయటపడటంతో పలువురు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.