YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సునీతారెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సునీతా రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లుత్రా నేడు ధర్మాసనం ముందు కేసు మెన్షన్ చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది.

అవినాష్ రెడ్డికి గత నెల 31వ తేదీన తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. సునీత దాఖలు చేసిన పిటిషన్ లో అవినాష్ రెడ్డిపై మోపిన అభియోగాలు అన్నీ చాలా కీలకమైనవని పేర్కొంది. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని సునీత తెలిపారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకిస్తొందని పిటిషన్ లో వెల్లడించారు. సునీత పిటిషన్ పై విచారణ సందర్భంలో సుప్రీం కోర్టు లో సీబీఐ కూడా వాదనలు వినిపించనున్నది.
మరో పక్క అవినాష్ రెడ్డిని సీబీఐ గత శనివారమే అరెస్టు చేసి వెంటనే బెయిల్ పై విడుదల చేసినట్లుగా తెలుస్తొంది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఆర్డర్ లో పేర్కొన్న ఆదేశాలతో రూ.5లక్షల పూచికత్తుతో సీబీఐ బెయిల్ పై అవినాష్ రెడ్డిని విడుదల చేసింది. మరో పక్క అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో 8వ నిందితుడుగా చేర్చింది సీబీఐ. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు .. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ మంత్రి గంగులకు తప్పన పెను ప్రమాదం .. పడవ మునగడంతో చెరువులో పడిపోయిన మంత్రి గంగుల