NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CP Stephen Ravindra: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర .. సుపారీ గ్యాంగ్ అరెస్టు..బీజేపీ ప్రముఖ నేతలపై అనుమానాలు..?

CP Stephen Ravindra: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను ఛేదించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సుపారీ గ్యాంగ్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేయడం, దీని వెనుక బీజెపీ నేతల పేర్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ స్టీఫెన్ రవీంద్ర  మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 25న ఫరూక్, హైదర్ ఆలీ సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో ఉండగా నాగరాజు మరి కొందరు వెంబడించి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. వారి నుండి తప్పించుకున్న ఫరూక్, హైదర్ ఆలీ షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారనీ, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాధ్ దాడికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు.

Cyberabad CP Stephen Ravindra speaks on conspiracy to assassinate minister Srinivas goud
Cyberabad CP Stephen Ravindra speaks on conspiracy to assassinate minister Srinivas goud

CP Stephen Ravindra:  నిందితులకు ఢిల్లీలో బీజేపీ నేత డ్రైవర్ ఆశ్రయం

గత నెల 26న నిందితులను అరెస్టు చేసి విచారణ చేయగా ఈ ముఠా అంతా మంత్రి హత్యకు కుట్ర పన్నినట్లు తేలిందన్నారు. సుపారీ హత్య గురించి ఫరూక్..హైదర్ ఆలీకి చెప్పారనీ, వీరి మధ్య వివాదం మొదలైందన్నారు. ఫరూక్, హైదర్ ఆలీని చంపాలని మిగతా ముఠా చూసింది. హత్య కేసు బయటపడుతుందని మిగతా వాళ్ల ఢిల్లీకి పారిపోయారన్నారు. వారి కాల్ డేటా ద్వారా లొకేషన్ ట్రేస్ చేయగా బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నట్లు తేలిందనీ, వారికి జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు  షెల్టర్ ఇచ్చారన్నారు. రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి నుండి రెండు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని ప్లాన్ వేసినట్లు తేలిందన్నారు.

బీజేపీ నేతలు డీకె అరుణ, జితేందర్ రెడ్డి పాత్రలపైనా విచారణ

ఈ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి పాత్రపైనా కూడా విచారణ జరుపుతామనీ, మాజీ మంత్రి డీకే అరుణ అనుచరులైనా అనుమానాలు ఉన్నాయనీ వాటిపైనా విచారణ చేస్తామని సీపీ చెప్పారు. సాంకేతిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామనీ, ఉత్తరప్రదేశ్ నుండి నాగరాజు వెపన్స్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 8 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన  తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N