NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీపై పవన్ కీలక ప్రకటన .. పొత్తు ఎవరితో అంటే…?

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏపి రాజకీయాలపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుగా ప్రకటించినప్పటికీ బీజేపీ నేతల ఒత్తిడితో విరమించుకున్నారు. బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ ఆ దిశగా ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బీజేపీ పెద్దలపై గౌరవం ఉందని చెబుతున్నప్పటికీ ఏపి బీజేపీ నేతలతో సమన్వయం లోపించిందని అంగీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలంగాణ జనసేన శ్రేణులు సంతోషపడేలా ప్రకటన చేశారు. తెలంగాణలో ఏడు నుండి 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలిపారు పవన్ కళ్యాణ్. కొండగట్టు నుండి తెలంగాణలో రాజకీయం మొదలుి పెడతామని పవన్ పేర్కొన్నారు.

Pawan Kalyan

 

అయితే తెలంగాణలో బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా లేక ఆ పార్టీతో తెగ తెంపులు చేసుకుని అధికార టీఆర్ఎస్ తో పోటీ చేస్తారా అనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ఇంతకు ముందు జనసేనతో మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలు తెలంగాణ మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు పలికాయి. టీఆర్ఎస్ తో పవన్ కళ్యాణ్ కు విభేదాలు ఏమీ లేవు. సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ తో సన్నిహిత సంభంధాలు పవన్ కళ్యాణ్ కు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తారా అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీ తో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ పై ఏనాడూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయలేదు. దీంతో టీఆర్ఎస్ కు దగ్గర అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తమ ఫందా మార్చుకుంటుంటామని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ రోజే ప్రకటించినందున త్వరలోనే పొత్తుల అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ఏపిలో టీడీపీతో మరల పొత్తు ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు దగ్గర అవుతున్నాయనే సంకేతాలు వచ్చేశాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్లు ఇటు ఏపిలో గానీ అటు తెలంగాణలో గానీ జనసేన అడుగులు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N