Nandamuri Balakrishna: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉనికిలో కూడా లేదని ఇప్పటి వరకూ భావిస్తుండగా, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసి సెంట్రల్ జైల్ కు తరలించడంతో తెలంగాణలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తొలుత చంద్రబాబు అరెస్టును అధికార బీఆర్ఎస్ నేతలు ఖండించలేదు. కానీ ఆ తర్వాత వరుసగా తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. పలు చోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లోనూ అధికార బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పొందేందుకు ప్రధాన రాజకీయ పక్షాల నేతలు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ సమావేశం నిర్వహించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తొంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంత కాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇకపై టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని బాలకృష్ణ అశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని అన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం చేస్తామన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తాను అండగా ఉంటానని తెలిపారు బాలకృష్ణ. చంద్రబాబు అరెస్టుపై కొందరు వెంటనే స్పందించలేదని పరోక్షంగా బీఆర్ఎస్ పై బాలకృష్ణ విమర్శలు చేశారు. తాను ఇక్కడే ఉండి పార్టీని రక్షించుకుంటానని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు తెలంగాణ నేతలు చంద్రబాబు అరెస్టుపైన స్పందించినా, ఎన్టీఆర్ జపం చేసినా ఎటువంటి లాభం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ..చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ నుండి ఎవరు స్పందించకపోయినా డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్త ఉందో లేదో తనకు అవగాహన లేదనీ, అనవసరంగా ఎవరిపైనా తాము నిందలు వేయబోమని అన్నారు. ఏపీ మంత్రి రోజా చేస్తున్న విమర్శలపై స్పందించేందుకు బాలకృష్ణ నిరాకరిస్తూ..బురదపై రాయి వేస్తే తిరిగి మన మీదే పడుతుందని చెప్పారు.
IT Rides: హైదరాబాద్ లో మరో సారి ఐటీ సోదాల కలకలం .. ఈ సారి టార్గెట్ ఎవరంటే..?