కరీంనగర్ హుస్సేనీ పూరలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కు చెందిన కీలక నేత తఫీక్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది.

దాదాపు నాలుగున్నర గంటలకుపైగా పీఎఫ్ఐ నేత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి, తనిఖీల సమయంలో సదరు నేత ఇంట్లో లేరని తెలుస్తొంది. ప్రస్తుతం అతను గల్ఫ్ లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. అతనికి నిషేదిత ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్లు గుర్తించి ఎన్ఐఏ ఈ తనిఖీలు నిర్వహిస్తున్ట్నట్లు సమాచారం. గతంలో కరీంనగర్ లో పలువురు పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తల నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపి కొందరిని అరెస్టు చేసింది. ఉగ్ర సంస్థలతో సంబంధాలు నెరపుతున్న కారణంగా పీఎఫ్ఐ సంస్థపై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే.
కడపలో భారీ అగ్ని ప్రమాదం .. రూ.2 కోట్లకుపైగా ఆస్తినష్టం