NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLA Candidate: బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కామెంట్స్..సాదుకుంటారా..? చంపుకుంటారా ..? మీయిష్టం..!

BRS MLA Candidate: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు, గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గ్రామాల్లో ప్రజలకు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ హామీ లు ఇవ్వడంతో పాటు ఓటుకు నోటు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, పనులు చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇస్తూ తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఉంటారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి మరి కొద్ది గంటలు ముగియనున్న సమయంలో ఓ బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మోషనల్ బ్లాక్ మెయిలింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కుమార్తెతో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఓటు వేసి దీవిస్తే నాలుగో తేదీ జైత్ర యాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనని అన్నారు. దీవించకపోతే తాను తన భార్య, కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైత్ర యాత్రకు లేదా శవయాత్రకు రండి అంటూ పిలుపు నిచ్చారు. సాదుకుంటారా.. చంపుకుంటారా మీ ఇష్టం అంటూ మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రత్యర్ధి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. కాగా, ఈ ఎమ్మెషనల్ సెంటిమెంట్ వ్యాఖ్యలకు ఓట్లు రాలతాయా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే.

పాడి కౌశిక్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. నాటి టీఆర్ఎస్ అభ్యర్ధి ఈటల రాజేందర్ పై 43,719 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 లో ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించగా, ఇవ్వలేదు, దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కొరకు కౌశిక్ రెడ్డి కృషి చేసినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్ధి గా నిలిచిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 23, 855 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్ధిగా వడితాల ప్రణవ్ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉన్నట్లుగా తెలుస్తొంది.

Telangana Election 2023: ప్రైవేటు సంస్థలు, కంపెనీలకు ఈసీ కీలక ఆదేశాలు .. పోలింగ్ రోజు సెలవు ఇవ్వాల్సిందే

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri