NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..?

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వ ఏర్పాటునకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి సోమవారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ నుండి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ముఖ్య నేతలు హజరు అయ్యే అవకాశం ఉంది.

ఈ వేళ రాత్రే సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో సమావేశం ఏర్పాటు చేయగా, గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధులు హోటల్ కు చేరుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ సాగనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారని, మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 6వ తేదీన జరగనుందని తొలుత సమాచారం అందింది. తాజాగా అందిన సమాచారం మేరకు రేపు (సోమవారం) ఉదయం హోటల్ ఎల్లాలో 9 గంటలకు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో సీఎల్పీ నేత ఎంపిక జరుగుతుందని అంటుందని సమాచారం. అయితే సీఎం ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదని అన్నారు సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం విషయంలో రేపు స్పష్టత వస్తుందని అన్నారు. తన అభిప్రాయం రేపు చెబుతానని ఉత్తమ్ పేర్కొన్నారు.

కాగా, మరో పక్క టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు రేవంత్ రెడ్డి అందజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అహ్వానించాలని కోరనున్నారు. రాజ్ భవన్ కు వెళ్లిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, కర్ణాటక డీప్యూటి సీఎం డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.

కాగా, పార్టీ ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను దూత ద్వారా రాజ్ భవన్ కు పంపారు. గవర్నర్ తమిళి సై సీఎం కేసిఆర్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం కేసిఆర్ కేసిఆర్ ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ కు వెళ్లారు.

Breaking: సీఎం పదవికి కేసిఆర్ రాజీనామా

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju