NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

News Channels: ఆ న్యూస్ ఛానల్స్ పై కేంద్రం నిషేదాజ్ఞలు … సుప్రీం కోర్టు గత తీర్పు ఇలా

News Channels: దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన న్యూస్ ఛానల్స్ పై కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కొరఢా ఝులిపిస్తూ ఉంటుంది. లైసెన్సులను తాత్కాలిక సస్పెండ్ చేయడం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అనధికార న్యూస్ ప్రసారాలు చేసిందనీ, నిబంధనలు తుంగలో తొక్కిందన్న అభియోగాలపై లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గత ఏడాది 84 అన్ లైన్ న్యూస్ ఛానల్స్ ను కేంద్రం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అంతే కాకుండా 23 న్యూస్ వెబ్ సైట్ లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. భారతదేశ సార్వ భౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతను భంగం కలుగజేస్తున్నారన్న కారణంగా గత ఏడాది 300 పైగా యాప్స్ ను నిధించిన కేంద్రం 2021 ఐటీ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో 22 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ను నిషేదించింది.

supreme court verdict on news channels banning orders

 

అయితే పెద్ద ఎత్తున వ్యూయర్ షిప్ ఉన్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ లైసెన్సు ను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేశారంటూ వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది జనవరి నెలలో కేరళలో మలయాళ వార్త ఛానల్ ‘మీడియావన్’ ను దేశ భద్రతా కారణాలతో కేంద్రం నిషేదించింది. ఆ నిషేద ఉత్తర్వులపై సదరు మీడియా సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం విధించిన నిషేదాన్ని రద్దు చేసింది.

ఆ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. మీడియాపై అకారణంగా నిషేదం అమలు చేస్తే పత్రికా స్వేచ్చకు విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. నిషేదాన్ని సమర్దిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించవద్దనీ, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చ అత్యంత ప్రధానమని పేర్కొంది. పాలనపై వాస్తవాలు వెల్లడించే మీడియా ద్వారా పౌరులు ఒక అభిప్రాయానికి వస్తారని చెప్పింది. సరైన నిర్ణయాలు తీసుకునే ప్రజల ద్వారానే ప్రజాస్వామయ్ సరైన పథంలో ముందుకు సాగుతుందని, ఏక ధృవ పోకడలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయని పేర్కొంది.

PM Modi: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తాం

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!