NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తాం

PM Modi: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. కేసిఆర్ సర్కార్ అవినీతిని పెంచి పోషిస్తొందని విమర్శించారు. వరంగల్లు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ..దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసిఆర్ద్ దేనని అన్నారు. తొమ్మిదేళ్లలో కేసిఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. యువత, ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగడం లేదని అన్నారు. కేసిఆర్ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవితపై పరోక్ష విమర్శలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పని చేస్తాయని కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయనీ, దీని కోసమేనా యువత బలిదానాలు చేసిందని మోడీ ప్రశ్నించారు.

PM Modi Speech In Warangal Telangana

 

కేసిఆర్ సర్కార్అంటే అదో కుటుంబప పాలన వ్యవస్థ అని మోడీ ఎద్దేవా చేశారు. కేసిఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర సంస్థలు గురి పెట్టాయనీ, స్కామ్ ల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసిఆర్ కొత్త నాటకాలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో దీనిపైనా మోడీ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ – బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని మోడీ స్పష్టం చేశారు. కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించామనీ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక ప్తాత్ర అని కొనియాడిన మోడీ..ఆర్ధిక వృద్ధిలోనూ తెలంగాణ ముందుందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందని అన్నారు. తెలంగాణలో ఆరు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆర్ధిక హబ్ గా మారుతోందని మోడీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయని అన్నారు. తొలుత వరంగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొద్ది సేపు మోడీ ధ్యానం చేశారు.

Breaking: ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కు బిగ్ షాక్ .. లైసెన్స్ ను సస్పెండ్ చేసిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ..?

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju