NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Kishan Reddy: తెలంగాణలో రేవంత్ సర్కార్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు .. తుమ్మినా .. దగ్గినా ప్రభుత్వం పడిపోతుందంటూ..

BJP Kishan Reddy: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 కాగా, కాంగ్రెస్ 64 మంది, ఒక సీబీఐ సభ్యుడు గెలిచారు. నేడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా నియమితులైయ్యారు. ఆయనతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. రేవంత్ రెడ్డి సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అందులో బాగంగానే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ని చేశారని అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ను చేశారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా..దగ్గినా పడిపోతుందని అందుకే మజ్లిస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తొందని కిషన్ రెడ్డి విమర్శించారు. . కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాలరాసిందని విమర్శించారు. మజ్లిస్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆ పార్టీకి వ్యక్తిని ప్రొటెం స్పీకర్ ను చేసిందని అన్నారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవేళ ప్రమాణ స్వీకారం చేయరని చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తొందని అన్నారు.

ఈ అంశంపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించారన్నారు. ఒక్క స్థానం నుండి 8 స్థానాలకు పెరిగామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు శాతం నుండి 14 శాతానికి తమ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. అంతకు ముందు నూతనంగా గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆయన సత్కరించారు.

KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసిఆర్ ఎన్నిక

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju