NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

నీతి అయోగ్ సమావేశానికి వెళితే పోను రాను ఖర్చులు దండగ తప్ప వచ్చేది ఏమి ఉండదు.. అందుకే బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న తెలంగాణ సీఎం కెసిఆర్

Telangana CM KCR Cabinet Meet
Advertisements
Share

రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరో సారి తూర్పర బట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీతి అయోగ్ సమావేశాన్ని తాము ఎందుకు బహిష్కరిస్తున్నది తెలియచేయడానికి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నీతి అయోగ్ సమావేశంలో నాలుగు నిముషాలు మాట్లాడేందుకు నాలుగు గంటలు కూర్చోవాలి, అంత సేపు కూర్చొని మనం చెప్పిన విషయాలపై ఏమైనా స్పందన ఉంటుందా అంటే ఏమి ఉండదు. నీతి అయోగ్ సిఫార్సు లను కేంద్రం పట్టించుకోదు. వాళ్ళు చేసేదే చేస్తారు. రక్షణ రంగంలో పాలసి మార్పులపై ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు కెసిఆర్. దేశ ఆర్ధిక వ్యవస్థ ను మోడీ సర్కార్ సర్వ నాశనం చేసిందని దుయ్య బట్టారు. మోడీ వ్యక్తి గతంగా తనకు మంచి మిత్రుడే కానీ ప్రజా వ్యతిరేక విధానాలు ఆవలంబిస్తున్నప్పుడు వాటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.

Advertisements

Telangana CM KCR Cabinet Meet

 

సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన నడుస్తుందని ఘాటుగా విమర్శించారు కెసిఆర్. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించి ఆదివారం జరుగుతున్న నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేసినట్లు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని తెలిపారు కెసిఆర్. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ ను తీసుకోని వచ్చిందని కానీ, దురదృష్టవశాత్తు నిరర్థక సంస్థగా మారిందని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా నీతి ఆయోగ్‌ పరిస్థితి తయారైందని అన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేసారన్నారు. చివరకు నల్ల చట్టాలు రద్దు చేసి ప్రధాని స్వయంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisements

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని, ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపయ్యాయిని చెప్పారు. దేశంలో సాగుకు నీరు లభించడం లేదు, విద్యుత్‌ లేదు, బీజేపీ ఎనిమిదేళ్ల ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని కెసిఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోందన్నారు. కేంద్ర – రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది రూ.5వేల కోట్లు మాత్రమే నని చెప్పారు కెసిఆర్. కేంద్రానికి తాము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల్లో, ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కెసిఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో త్వరలో పది లక్షల మంది పేదలకు కొత్త గా పెన్షన్ లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. 75 ఏళ్ల ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు కూడా బీమా అందిస్తామని సీఎం కెసిఆర్ వెల్లడించారు.

21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆ నలుగురు ప్రముఖులు


Share
Advertisements

Related posts

China Marathon: మారథాన్‌‌లో విషాదం ..21 మంది రన్నర్‌లు మృతి

somaraju sharma

దక్షిణ కోస్తాకు తుపాను గండం

Siva Prasad

కరోనా నియంత్రణ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ సుప్రీం కోర్టు…!

arun kanna