బాక్సాఫీస్ వ‌ద్ద `బింబిసార‌` బీభ‌త్సం.. ఫ‌స్ట్ డే ఎంతొచ్చిందో తెలుసా?

Share

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన‌ తాజా చిత్రం `బింబిసార‌`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ వశిష్ఠ్ తెర‌కెక్కించిన ఈ సోషల్ ఫాంటసీ మూవీలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎం.ఎం. కీరవాణి, చిరంతన్ భట్ స్వ‌రాలు అందించారు. ఆగ‌స్టు 5న అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ చిత్రం.. తొలి షో నుండే పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజంలోకి వ‌చ్చేస్తాడు బింబిసారుడు. ఆ త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో ఈ మూవీ సాగుతుంది.

మొదటి నుంచి చివరివరకూ కథ, క‌థ‌నం ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇందులో క‌ళ్యాణ్ ద్విపాత్రాభిన‌యం చేసి అద‌ర‌గొట్టేశాడు. ఇక టాక్ బాగుండ‌టంతో.. తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బింబిసార బీభ‌త్సం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.30 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచ‌వ్యాప్తంగా రూ. 7.27 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా `బింబిసార‌` ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.15 కోట్లు
సీడెడ్: 1.29 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.90 కోట్లు
తూర్పు: 0.43 కోట్లు
పశ్చిమ: 0.36 కోట్లు
గుంటూరు: 0.57 కోట్లు
కృష్ణ: 0.34 కోట్లు
నెల్లూరు: 0.26 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ‌= 6.30కోట్లు(9.30కోట్లు~ గ్రాస్)
———————————–

కార్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా= 0.32 కోట్లు
ఓవ‌ర్సీస్ – 0. 65 కోట్లు
———————————–
టోటల్ వరల్డ్ వైడ్: 7.27కోట్లు(11.50కోట్లు~ గ్రాస్)
———————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 15.6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ల్ల క్లీన్ హిట్ అవ్వాలంటే మొదటి రోజు వ‌చ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 8.93 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

3 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago