Avunu Valliddaru Ista Paddaru: పూజ మనోజ్ అంటే తనకి ఇష్టం లేదని చెబుతుంది. దాంతో మనోజ్ కాస్త రిలాక్స్ అవుతాడు. ఇక్కడి నుంచి పారిపోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని పూజ మనోజ్ కి ధైర్యాన్ని ఇస్తుంది. రేపు 9 గంటలకు మన ఇద్దరికీ పెళ్లి అని పూజ చెబుతుంది. కళావతి తో నాకు 11 గంటలకు పెళ్లి అని మనోజ్ అంటాడు. నువ్వు మా మామ చెప్పినట్టు మన పెళ్ళికి ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చెయ్యి అని చెబుతుంది..

ఇక నీకు పెళ్లి కొడుకు బట్టలు కూడా ఇస్తారు అవి వేసుకొని రెడీ గా ఉండు.. నా లెఫ్ట్, రైట్ నీ దగ్గర కి వస్తారు. అలా వస్తున్నప్పుడు నిన్ను మీ ఊరు కాడ వాళ్ళు దింపేసి వస్తారు.. సరేనా అని పూజ సలహా ఇస్తుంది. సరే అని మనోజ్ పూజకి థాంక్యూ చెబుతాడు..
Krishna Mukunda Murari: మురారికి దూరమవుతున్న కృష్ణ.. అసలు విషయం తెలుసుకున్న ముకుంద.!
పూజ వాళ్ళ మామ రెడ్డప్ప వాళ్ళ అమ్మతో మనోజ్ గురించి మాట్లాడుతూ ఉండగా.. పూజా చాటుగా నిలబడి ఆ మాటలను వింటుంది. మనోజ్ మన పూజను చేసుకున్నాడా ఓకే.. చేసుకోకపోతే వాడి ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని రెడ్డప్ప ప్రమీలతో అంటాడు. ఇప్పటికే బావాలేకుండా.. నిన్ను అందరూ అంటున్న మాటలు విని విసుగెత్తిపోయాను. ఇప్పుడు మనోజ్ కూడా పూజలు పెళ్లి చేసుకోకుండా.. తనతో కాపురం చేయకోకుండా ఉంటే.. నేను ఎంతకైనా తెగిస్తాను అని రెడ్డప్ప ప్రమీలతో మాట్లాడుతున్న మాటలను పూజా విని.. నన్ను క్షమించు మామ మనోజ్ ని నేనే తప్పిస్తాను అని మనసులో అనుకుంటుంది.

దయానంద్ దగ్గరికి వాళ్ళ ఆవిడ కూతురు వాళ్ళ అమ్మ ముగ్గురు కట్టకట్టుకుని వచ్చి ఢిల్లీని పిలవమని అడుగుతారు. తన ఫోన్ లాక్కొని తన కూతురు ఢిల్లీకి ఫోన్ చేస్తుంది అక్క. కానీ ఢిల్లీ ఫోన్ కలవదు. మనోజ్ అనుకొని కళావతి ఫ్రెండ్స్ ఢిల్లీని చూసి చాలా బాగున్నాడు.. అందంగా ఉన్నాడు అంటూ తనని ఆటపట్టిస్తూ ఉంటారు. అప్పుడే కళావతి మనోజ్ ని తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది. మనోజ్ తన దగ్గరకు రాగానే మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. మనోజ్ లాగా ఉన్నా ఢిల్లీ కళావతిని ఎత్తుకొని తన గదిలోకి తీసుకు వెళ్తాడు. నేను యాక్టింగ్ చేస్తున్నానని మీకు తెలిసిపోయిందా అంటూ కళావతి కాసేపటికి కళ్ళు తెరిచి మాట్లాడుతుంది.

Avunu Valliddaru Ista Paddaru: కళావతికి నిజం చెప్పిన ఢిల్లీ.. మనోజ్ ను పంపడానికి పూజ ప్లాన్..
రేపటి భాగంలో కళావతి ఎందుకు రమ్మన్నావు అని మనోజ్ ని అడుగుతుంది.. ప్రేమ కోసం నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు అని ఢిల్లీ అంటాడు ..నువ్వు తప్పు చేయడం ఏంటి అని కళావతి అడుగుతుంది .. నేను మనోజ్ ని కాదు ఢిల్లీని అని చెబుతాడు. నువ్వు ఏ శిక్ష వేసిన నేను భరిస్తాను అంటూ.. నన్ను క్షమించు అని ఢిల్లీ మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఢిల్లీని అక్కడ చూడగానే కోపంతో కంప పగలగొట్టడానికి కళావతి చెయ్యి ఎత్తుతుంది.
