కమలకు నొప్పులు రావడంతో కింద పడిపోయి భాషా భాషా అని అరుస్తుంది.. కమల మాటలు విన్న సత్య వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అక్క అని అడుగుతుంది.. భాషా ముందు వెళ్లి బండి తీసి పెట్టు కమలకు నొప్పులు వస్తున్నాయి.. అందరూ కంగారు పడకండి హాస్పటల్కి తీసుకువెళ్దాం అని దేవుడమ్మ చెబుతుంది .. భాష నువ్వు ఏం కంగారు పడకు కచ్చితంగా శుభవార్త వింటాము అని దేవుడమ్మ ధైర్యం చెబుతుంది.. అప్పుడే కమలకు ఆడబిడ్డ పుట్టిందని డాక్టర్స్ వచ్చి చెబుతారు..
సత్య రాధ కు ఫోన్ చేసి అక్క నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి.. మన కమల అక్కకు ఆడబిడ్డ పుట్టింది.. డాక్టర్లు ఈ విషయం చెప్పగానే మొదటి నీకే ఫోన్ చేస్తున్నాను అని సత్య అంటుంది.. అవునా నేను వెంటనే వస్తున్న అని అనే లోపు ఏ హాస్పిటల్ అని అడుగుతుంది.. ప్రవీణ్ హాస్పిటల్ అని సత్య చెబుతుంది. ఇక వెంటనే ఎలాగైనా ఆ బిడ్డను చూడాలి అని అనుకునీ.. భాగ్యమ్మను గబగబా తన రూమ్ లోకి తీసుకెళ్లి గడి పెట్టి .. అమ్మ నువ్వు అమ్మమ్మ అయ్యావు అని చెబుతుంది రాధ.. నేను ఎప్పుడూ అమ్మమ్మని అయ్యాను కదా అని అంటుంది భాగ్యమ్మ ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మ అయ్యావు అనగానే.. నవ్వుతూ రాదా కమల అక్కకి ఆడబిడ్డ పుట్టింది అని చెబుతుంది .. నేను వెంటనే వెళ్తున్నాను అని భాగ్యమ్మ అనగానే.. నేను చూడొద్దా అని రాధా అడుగుతుంది.. సరే ఏదైతే అది అయిందని భాగ్యమ్మ రుక్మిణిను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తుంది.
ఎవరికోసం ఏడుస్తున్నావ్ అమ్మ ఇక్కడ అందరం నీకోసం ఉన్నాము కదా అని దేవుడమ్మ ఆ పాపాయిని చూస్తూ ఉంటుంది.. ఇంకా నీ కోసం ఎవరు రావాలి అని అడుగుతుంది. అంతలో రుక్మిణి చాటుగా కిటికీ గదిలో నుంచి ఆ పాపను చూస్తుంది. అప్పుడే దేవుడమ్మ ఆ బిడ్డను పైకి లేపి ఎత్తుకొని ఆటాడిస్తుంది.. అత్తమ్మ నాకు బిడ్డని ఇవ్వు అని రుక్మిణి అడగగానే ఇదిగో మీ పిన్ని వచ్చింది చూడు అని పాపాయిని రుక్మిణికి ఇస్తుంది. రుక్మిణి ఎత్తుకోగానే పాపాయి ఏడుపు ఆగిపోయిందని అందరూ అంటారు. పిన్నమ్మని ఇప్పటినుంచే నీ మాయలో పడేసావా అని ఆ పాపాయిని దేవుడమ్మా అంటుంది.. అందరూ సంతోషంగా ఉంటారు రుక్కుని ఆ పాపని ఎత్తుకొని ఆనందంతో ముద్దులు పెడుతుంది.. బహుశా ఈ సన్నివేశాన్ని రుక్మిణి ఊహించినట్టుగా లేదంటే భాగ్యమ్మ గాని దేవుడమ్మ కానీ ఊహించినట్టుగా చిత్రీకరిస్తారు..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!