NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: రుక్మిణితోనే ఉన్న ఆదిత్య బండారం బయట పెట్టిన సత్య.. నర్స్ నరాల్లో గుజ్జు తీస్తానన్న రాధ..!

Devatha Serial 13 September 2022 Today episode Highlights

Devatha: మాధవ్ ద్వారా నిజం తెలుసుకున్న రాధ ఆ నర్స్ ని ఒక్కటి పికుతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ ఏమైంది.. ఎందుకు నర్స్ ని కొడుతున్నారు అని అడుగుతారు డాక్టర్ అంటుంది.. ఈ నర్స్ మీరు ఇచ్చిన మందులు వాడకుండా ఆ మాధవ్ సార్ చెప్పినట్టు చేస్తుంది.. నా పెనిమిటి పెద్ద ఆఫీసర్.. మీరు ఇలాంటి కథలు పడుతున్నారు అని చెబితే మీ అందరినీ జైల్లో వేస్తాడు అని రాధ వార్నింగ్ ఇస్తుంది.. అయితే వెంటనే ఈ నర్స్ ను హాస్పిటల్ నుంచి పంపుంచేస్తా అని డాక్టర్ అంటుంది.. వద్దు అలా చేయొద్దు.. అలా చేస్తే ఆ మాధవ్ మళ్ళీ ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాడు.. కాబట్టి ఈమె ఇక్కడే ఉండాలి.. కానీ జానకమ్మ ఆరోగ్యం మాత్రం నయం అవ్వాలి.. అందుకు మీరే బాధ్యత తీసుకోవాలి.. లేకపోతే నేను అందర్నీ జైల్లో కూర్చో పెడతా అని రాధ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది..!

Devatha Serial 6 October 2022 Today Episode Highlights
Devatha Serial 6 October 2022 Today Episode Highlights

ఆ నర్స్ ను చూస్తూ నువ్వు గనక నాకు ఈ విషయం తెలిసింది అని ఆ మాధవ్ సార్ కి గనుక చెప్పినట్టు నాకు తెలిసిందో.. నీ నరాల్లో గుజ్జు తీస్తాను జాగ్రత్త అని రాధ వార్నింగ్ ఇస్తుంది.. నేను చెప్పినట్టుగానే ఆమెకు వైద్యం చేయాలి.. ఆమెకు నయం అవ్వడమే నాకు కావాలి అని రాధా అంటుంది.. సరే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను అని ఆ నర్స్ అంటుంది.. ఆ నర్స్ ఎప్పటిలాగానే మందులు తీసుకొని జానకమ్మ దగ్గరకు వెళుతుంది.. అప్పుడే మాధవ్ తనను ఆపి నేను చెప్పినట్టుగానే ట్రీట్మెంట్ చేస్తున్నారా అని అడుగుతారు.. హా సార్ మీరు చెప్పినట్టే చేస్తున్నాను అని చెబుతుంది.. మళ్లీ ఆ నర్స్ కు మాధవ్ డబ్బులు ఇస్తాడు.. మీరు ఇలాగే చేస్తూ ఉంటే చివర్లో మీరు ఊహించని గిఫ్ట్ ఇస్తాను అని మాధవ్ అంటాడు.. సరే అని ఆ నర్స్ అక్కడ నుంచి జానకమ్మ దగ్గరికి వెళ్తుంది.. రాధా కళ్ళతో సరైన మందులు తీసుకొచ్చావు కదా అని అడుగుతుంది.. అవే తీసుకువచ్చాను అని నర్స్ కళ్ళతో సైగ చేస్తుంది.. సరే అని రాధ అంటుంది..

మాధవ్ పంపించిన లొకేషన్ కు సత్య వస్తుంది.. మాధవ్ సత్య కు అదిగో సత్య చూడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూపిస్తాడు.. అప్పుడే రుక్మిణి ఇంటికి వెళ్ళిపో పెనిమిటి అని ఆదిత్య కు చెబుతుంది.. అది చూసిన సత్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది.. ఇక రుక్మిణి మాట కాదనలేక ఆదిత్య ఇంటికి వెళ్తాడు.. ఆదిత్య ఇంటికి వెళ్ళగానే క్యాంప్ ఎలా జరిగింది అని ఆదిత్య ను సత్య అడుగుతుంది.. క్యాంప్ అని పదేపదే అడుగుతున్న సత్య ను ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు.. సత్య కోపంగా నువ్వు ఎక్కడికి వెళ్లావు ఏ క్యాంపుకు వెళ్లావు నేను చెప్పనా అంటూ.. తన ఫోన్ తీసి తన ఫోన్లో ఆదిత్య రుక్మిణి కలిసి ప్రకృతి వైద్యశాలలో మాట్లాడుకుంటున్న ఫోటోలు తీసి చూపిస్తుంది.. అంతే ఆదిత్య ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు..

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N