తులసి కి మంచి కోడలిగా.. మంచి మనిషి గొప్ప మనిషి అని పిలిపించుకోవాలి అనే ఇమేజ్ అంటే.. తులసికి చాలా ఇష్టం అందుకే ఇలా చేస్తుంది అని నందు అంటాడు.. ఆ ఇమేజ్ వదులుకోవడానికి అస్సలు ఇష్టపడదు అని నందు అంటాడు..అయినా ఆ నిజం సామ్రాట్ గారికి తెలిస్తే అమ్మకు వచ్చే లాభమేంటి అని ప్రేమ్ ప్రశ్నిస్తాడు.. ఎందుకు అమ్మని వేలెత్తి చూపిస్తున్నారు అని ప్రేమ్ అంటాడు.. నువ్వు ఎంత చేసినా నా అంత ఎత్తుకు ఎదగలేవూ అని నందు అంటాడు.. అంతలో తులసి నా ముందు నువ్వు ఎప్పటికీ తల దించుకునే ఉండాలి అని అంటుంది తులసి..!!
శృతి పాల గ్లాస్ తీసుకువచ్చి పక్కన పెడుతుంది.. చేతికి ఇవ్వచ్చుగా అని ప్రేమ్ అంటాడు.. నీకు ఇవ్వటమే ఎక్కువ అని శృతి అంటుంది.. నువ్వు తాగకపోతే నేను ఈ విషయాన్ని ఆంటీ తో చెబుతాను అని శృతి అంటుంది.. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతుండగా తులసి మధ్యలో వస్తుంది.. ఏమైందిరా ఏంటి రా మీ గొడవ అని తులసి అడుగుతుంది.. అయ్యో అదేమీ లేదు అమ్మ అని ప్రేమ్ అంటాడు.. ఎందుకు ప్రేమ దాస్తావు ఆంటీతో నిజం చెప్పేద్దామని శృతి అంటుంది.. ఏమైందో నువ్వు చెప్పమ్మా శృతి అని తులసి అడుగుతుంది..
ప్రేమ్ ఎక్ససైజ్ చేస్తున్నాడు కదా ఆంటీ.. ఎక్ససైజ్ చేసిన వెంటనే పాలు తాగితే మంచిదని తనకోసం పాలు తీసుకొచ్చాను.. ఇప్పుడు తాగమంటే తాగడం లేదు అని శృతి కవర్ చేస్తుంది.. సరే ఆ పాలివ్ అమ్మ వాడే తాగుతాడు అని అంటుంది.. ప్రేమ్ శృతి ఉప్పు కలిపిన పాలు తాగి ప్రేమ్ ఇప్పుడు కాదు తర్వాత తాగుతాను అని అంటాడు.. అదంతా కుదరదు.. ఇప్పుడే మొత్తం పాలు తాగమని తులసి అంటుంది.. ఇక కళ్ళు మూసుకొని ప్రేమ ఆ పాలను గడగడా తాగేస్తాడు.. శృతి చాలా మంచిది రా.. అని ప్రేమ్ తో తులసి చెబుతుంది.. నాతోనే ఉప్పు కలిపిన పాలు తగిపిస్తవా చెబుతా నీ పని అని ప్రేమ్ అంటాడు..
రేపటి ఎపిసోడ్ లో తులసి అన్ని ఆలోచించుకున్న తర్వాత సామ్రాట్ కి మెసేజ్ చేస్తుంది.. ఇప్పటివరకు మ్యూజిక్స్ స్కూల్ కి సంబంధించిన అన్ని విషయాలలో నాకు హెల్ప్ చేశారు. కానీ నేను ఇప్పటితో మ్యూజిక్స్ స్కూల్ బిజినెస్ ఆపేయాలని అనుకుంటున్నాను.. నన్ను క్షమించండి అని తులసి సామ్రాట్ కి మెసేజ్ చేస్తుంది.. మరోవైపు అనసూయమ్మ కూడా నందుని తులసిని పెళ్లి చేసుకోమని అంటుంది.. ఇక ఏం జరుగుతుందో రేపటి భాగంలో చూద్దాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!