Intinti Gruhalakshmi: తులసి వాళ్ళ కుటుంబం అంతా కలిసి మాల్ కి వస్తారు. ఇక అదే మాల్ కి అభి అంకిత కూడా వస్తారు. ఇక ప్రేమ శృతి కూడా అదే మాల్ లో వాళ్ళకి కనిపిస్తారు. లక్కీ నందుని కి తీసుకుని రాగా.. లాస్య మధ్యలో జాయిన్ అవుతా అని వస్తుంది.. లాస్య రావడంతోనే లక్కీ తులసి దగ్గర కనిపిస్తాడు దాంతో లక్కీ లాస్య చిందులు తొక్కుతోంది. దాంతో నందు పై ప్రస్టేట్ అవుతున్న లాస్య ను చూసి.. మీరు కూడా ఏంటి అంటే డాడీ అని అపార్థం చేసుకున్నారు అని అభి అంటాడు. మేమెవరం అనుకొని ఇక్కడికి రాలేదు. డాడికి నాకు మమ్మీ అంటే పడదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా.. మేము ఎవ్వరం అనుకుని ఒకే చోటికి వస్తాము. మీరు డాడీ అని తప్పుగా అనుకోవద్దు అని అంటాడు అభి. సారీ అభి లక్కీ రాగానే తులసి దగ్గర కనిపించేసరికి బాగా ఫ్రష్స్ట్రే ట్ అయ్యాను. సారీ నందు అని అంటుంది లాస్య.

ఐ టి ట్రావెల్స్ వాళ్ళు లక్కీ డ్రా తీస్తారు కాశ్మీర్ కి ఫ్రీ ట్రిప్ తీసుకు వెళ్ళడానికి.. లక్కీని ఒక్కొక్క స్లిప్ తీయమని చెబుతారు. మొత్తం ఐదుగురు విన్నర్స్ ఉంటారు. ఐదుగురు ఉచితంగా తీసుకు వెళ్తున్నాము అని అనౌన్స్ చేస్తారు ట్రావెల్స్ వాళ్ళు.. లక్కీ ఫస్ట్ మొదటిగా నందు పేరు తీస్తాడు. నందు నీకు నా వల్ల లక్కీ తో లక్ కలిసి వచ్చిందని అంటుంది లాస్య.. ఇక సెకండ్ విన్నర్ నా అభి పేరు వస్తుంది. అభి నువ్వు నా పక్కన ఉండటం వల్ల నీకు లక్ కలిసి వచ్చింది అని లాస్య తననుతాను పొగుడుకుంటుంది.
ఇక మూడవ లక్కీ విన్నర్ గా లక్కీ దివ్య పేరు తీస్తాడు.. నాలుగవ లక్కీ విన్నర్ గా ప్రేమ్ నేమ్ అనౌన్స్ చేస్తారు. ఇక చివరిగా అయినా తులసి పేరు వచ్చేలా చెయ్యి దేవుడా అని లక్కీ దేవుడికి దండం పెట్టుకుంటాడు. తులసి ఆంటీ పేరు రాకపోతే లక్కీ మనసులో దేవుడా ఇంక నిన్ను ఏమీ అడగను అని అంటాడు.. మనసులో తులసి ఆంటీ పేరు రావాలి అనుకుంటూ ఉంటాడు. లాస్య నా పేరు రావాలి అని అనుకుంటుంది. లేకపోతే నా పరువు పోతుంది అనుకుంటుంది. మొత్తానికి లాస్ట్ లక్కీ విన్నర్ గా తులసి పేరు అనౌన్స్ చేస్తారు.

అంకిత ఐదు లక్షల రూపాయల చెక్కు రాసి ఇస్తుంది అభికి. ఆ చెక్కును అభి వాళ్ళ నాన్న వాళ్ళు కొత్త కంపెనీకి ఇన్వెష్ట్ మెంట్ కి ఇస్తాను అని చెబుతాడు. ఆ విషయం తెలిసి అంకిత అభి ఫైర్ అవుతుంది. ఇక అభి కి సపోర్ట్ గా గాయత్రి ఉంటుంది. గాయత్రి అంకిత ఫైర్ అవుతుంది నువ్వు చేసే పనులు నాకు ఏమి ఇష్టం లేదు నువ్వే నాకు ఇష్టం లేదు అని గాయత్రి అనడంతో అంకిత కోపం వచ్చి కూతుర్ని ద్వేషించే అమ్మ దగ్గర నేను ఉండను. నేను వెళ్ళిపోతున్నాను. అంటూ అంకిత తులసి వాళ్ళ ఇంటికి వస్తుంది. తులసి ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.