30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

సామ్రాట్ గతంలో ఉన్న విషాదం.!? నందుని తులసిని ప్రాధేయపడమన్నా లాస్య..!

Share

హనీ సామ్రాట్ తో మనకు ఇల్లు అయితే ఉంది కానీ అందులో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు.. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరికి నేనంటే భయం నాతో సరిగ్గా ఎవరు మాట్లాడరు.. నాకు ఏమన్నా జరిగితే నువ్వు వాళ్ళను ఏమైనా చేస్తావని వారికి భయం.. వాళ్ళు నాకు దూరం దూరంగా ఉంటారు.. ఇక నాకు ప్రేమగా కథలు చెప్పేవారు.. ఆప్యాయంగా అన్నం తినిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు.. అని హనీ తన బాధను సామ్రాట్ ముందు వ్యక్తపరుస్తుంది..

సామ్రాట్ హనీ మాటలను వినిన తర్వాత.. ఇంతే కదా హనీ.. రేపటి నుంచి నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను అని అంటాడు.. తులసి లాంటి వాళ్ళింట్లో చూడండి నాన్న ఎంతమంది ఉంటారో.. తాతయ్య, అమ్మమ్మ, అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ ఉంటారు.. మన ఇంట్లో ఎవరూ లేరు.. మనకు ఎవరూ లేరా డాడీ అని అడుగుతుంది.. ఆ మాటలకు సామ్రాట్ కళ్లల్లో నుంచి నీళ్లు కారిపోతాయి. అన్నయ్య నన్ను క్షమించు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని వాళ్ళ చెల్లి ఆత్మహత్య చేసుకున్న సంగతి తనకు గుర్తుకొస్తుంది.. దాంతో సామ్రాట్ కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతాయి.. అది చూసిన హనీ నన్ను క్షమించు నాన్న.. ఇంకోసారి ఈ ప్రశ్న నిన్ను వేను నిన్ను బాధ పెట్టే విషయాలు నేను అడగను.. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అని బాధపడుతుంది.

తులసి శృతి వల్ల అత్తయ్య కమలకు ఫోన్ చేస్తుంది. మీకు ఒంట్లో బాగోలేదు అంట కదా ఎలా ఉంది అని అడుగుతుంది.. మాయరోగం కదండి త్వరగా తగ్గదు అని.. తులసి శృతిని పంపించమని అడిగేలోపే తను కాల్ కట్ చేస్తుంది.. ప్రేమ్ అంకిత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.. తను ఇప్పుడు రావాలనుకుంటుందో అప్పుడే రానివ్వండి. నేను మాత్రం తీసుకురాను వదిన అని ప్రేమ్ అంటాడు..

తులసికి సామ్రాట్ వల్ల బాబాయ్ ఫోన్ చేసి రేపు మా ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాము.. దానికి నువ్వు కచ్చితంగా రావాలి అని చెబుతాడు. మీ కుటుంబంలో అందరూ కలిసి ఆ ఫంక్షన్ ను రావాలని చెబుతాడు.. హనీ లోన్లీగా ఫీల్ అవుతుంది. తన కోసమే ఈ ఫంక్షన్ను ఏర్పాటు చేశామని చెబుతాడు. ఇక అదే ఫంక్షన్ కి లాస్య నందు వల్ల కుటుంబాన్ని కూడా ఆహ్వానిస్తారు. ఎక్కడ ఆ ఫంక్షన్ లో నందు తులసి వాళ్ళ పిల్లలకు తండ్రి అని తెలిసిపోతుందని భయపడి తులసిని రిక్వెస్ట్ చేయడానికి వస్తాడు నందు..


Share

Related posts

స‌మంత అభిమానుల నిరీక్ష‌ణ‌కు బ్రేక్‌.. రేపు బిగ్ అప్డేట్ ఖాయం!

kavya N

మ‌హేశ్‌కు విల‌న్‌గా ఆ స్టార్ హీరోనా..? నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పండ‌గే!

kavya N

`ఆదిపురుష్‌`కు కొత్త చిక్కులు.. ప్ర‌భాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

kavya N