పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్తడే వస్తున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఈసారి బారీ ప్లాన్ వేశారు. సెప్టెంబర్ రెండవ తారీకు పుట్టినరోజు.. నేపథ్యంలో నెలరోజులు ఉండటంతో.. మహేష్ బాబు అభిమానుల ఆలోచన పవన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నరు. విషయంలోకి వెళ్తే ఆగస్టు 9వ తారీకు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ “పోకిరి” నీ లేటెస్ట్ టెక్నాలజీ రూపంలో ప్రింట్ రెడీ చేసి మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కోరిక మేరకు “పోకిరి” నిర్మాతలు ఒప్పుకొని.. ఆగస్టు 9వ తారీకు దేశంలో మరియు విదేశాలలో లేటెస్ట్ టెక్నాలజీ హంగులతో విడుదలకి రంగం సిద్ధం చేశారు.
అంత మాత్రమే కాదు ఈ లేటెస్ట్ “పోకిరి” ప్రింట్ కి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల మాదిరిగా అమ్ముడుపోయాయి. పరిస్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవన్ బర్త్ డే నాడు సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ “జల్సా” సినిమాని.. “పోకిరి” తరాహా లేటెస్ట్ ప్రింట్ తో.. “జల్సా” విడుదల చేసే రీతిలో ఆ సినిమా నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. వాస్తవానికి ప్రతి ఏడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఏదో ఒక రికార్డు హాష్ ట్యాగ్ పేరిట వైరల్ చేస్తూ క్రియేట్ చేస్తుంటారు.
అయితే ఈసారి “జల్సా” కొత్త తరహా లేటెస్ట్ ప్రింట్ సిద్ధం చేసి తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు విడుదల చేయాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట. మరి “జల్సా” నిర్మాతలు స్పందిస్తారో లేదో చూడాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తరుకెక్కిన “జల్సా” సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించడం జరిగింది. వరుసపరాజయాలలో ఉన్న పవన్ కెరియర్ ప్రారంభించాలి “జల్సా” సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!