Intinti Gruhalakshmi: శృతి శృతి అని ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు.. నాకు బంపర్ ఆఫర్ తగిలింది.. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ట్రై చేస్తున్నా కదా.. అందులో 25 పర్సెంట్ తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చాడు.. మీ ఫ్రెండ్ వందనా మనకి మనీ ఇస్తానని చెప్పింది కదా.. తనకి ఫోన్ చెయ్యి అని అంటాడు.. అంతలో తులసి ఫోన్ చేస్తుంది.. ప్రేమ్ కి కావాల్సిన 5 లక్షలు నేను ఇస్తాను అని చెబుతుంది.. నేను బ్యాంక్ లోన్ కి అప్లై చేశాను ఒక వారం లో డబ్బులు రావచ్చు అని అంటుంది.. ప్రేమ్ ఆనందంలో మునిగి తేలుతాడు..
అభి ఆఫీస్ కి వెళ్తుండగా గాయత్రి వచ్చి అంకిత తో మాట్లాడవా అని అంటుంది.. తను కావాలి అనుకుంటే తన దగ్గరకే రమ్మని చెబుతుంది.. సరే అయితే నువ్వు కూడా అక్కడికి వేళ్ళు అని అంటుంది గాయత్రి. అదేంటి ఆంటీ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు.. నేను అంకిత మాట వినాలి అంటున్నారు.. మీరు ఏమి అనుకోను అంటే మిమ్మల్ని ఒకటి అడగనా.. మీరు అంకుల్ మాట వింటున్నారా అని అంటాడు అభి.. గాయత్రి మనసులో అభి ఏంటి రివర్స్ అవుతున్నాడు అనుకుని తనే తగ్గాలి అని అనుకుంటుంది.. నా భయం అల్లా ఒక్కటే అభి తులసి మాయలో పడి ఆస్తి అంతా అంకిత పోగొడుతుందని నా భయం అని గాయత్రి కవర్ చేస్తుంది.
లాస్య ఆ లోన్ బ్రోకర్ కి ఫోన్ చేసి లోన్ విషయం ఏమైంది అని అడుగుతుంది. తులసి లోన్ అమౌంట్ తన అకౌంట్ నుంచి నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవగానే కేస్ పెడుతుంది తులసి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుని అని తెలిసి తులసి మీద కేసు పెడతారు.. అప్పుడు తులసి ని అరెస్టు చేస్తారు.. తనని ఇరికించారు అని తెలుసుకున్న తులసి ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతుంది.. మనల్ని అసలు ఏమి చేయలేక మౌనంగా ఉండి పోతుంది.. అది నా ప్లాన్.. న్యాయంగా లోన్ రావాలంటే చాలా రోజులు పడుతుంది.. కానీ అడ్డదారుల్లో రావడం చాలా సింపుల్ కేవలం రెండు రోజుల్లోనే లోన్ వస్తుంది మేడం అని చెబుతాడు..
మేడం నేను బ్యాంక్ లోన్ వాళ్ళు వస్తారు.. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్తారు.. ఈ ఫైల్ మీద సైన్స్ చేయడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు.. నాకు పెద్దగా చదువు లేదు అని తులసి అంటుంది. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను మీరు లేట్ చేస్తే ఎలాగా అని అంటాడు.. ఇక తులసి కూడా సైన్ చేసేస్తుంది.. ఇక అతను చెప్పిన ప్రతి చోట తులసి సైన్ చేస్తుంది. ఒక బ్లాంక్ చెక్ కూడా కావాలి అంటే.. దాని మీద కూడా తులసి సైన్ చేసి ఇస్తుంది.. ఇక తులసి అకౌంట్ లో లోన్ అమౌంట్ డెబిట్ అవుతుంది.. ఆ వెంటనే ఆ అమౌంట్ మొత్తం క్రెడిట్ అయ్యినట్టు మెసేజ్ వస్తుంది.. ఫేక్ డక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకున్నామని తెలిస్తే మన మీద కేసు అవుతుంది అని అంకిత అంటుంది.. ఇక తులసి ఏం చేస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!