నందు వాళ్ళింటికి తులసి వెళుతుంది.. ఎలాగైనా సామ్రాట్ కి తన మీద ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని.. తన నిజాయితీని నిరూపించుకోవాలని అనుకుంటుంది.. నందు చెప్పొద్దు అన్నాడు కాబట్టే కదా ఎన్ని రోజులు తను తన మాజీ భర్త అని సామ్రాట్ తో చెప్పలేదు.. ఇప్పుడు అదే విషయం నందు నోటితో చెప్పిస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని తులసి అనుకోండి.. ఇక ఆ విషయం మాట్లాడాలని నందుతో చెబుతుంది.. నా చేతులతో నా గొయ్యి నేను ఎందుకు తవ్వుకుంటాను.. నేను సామ్రాట్ తో ఆ విషయం చెప్పాలి అంటే.. హనీ ని నువ్వు సేవ్ చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ చేసింది నేనేనని నువ్వు చెప్పలేదు కదా.. ఇప్పుడు ఆ విషయం కూడా చెబుతాను అని నందు అంటాడు.. ఆ రోజు నిన్ను కాపాడాలని నేను ఆ విషయం చెప్పలేదు.. ఇప్పుడు అదే విషయాన్ని అడ్డం పెట్టుకొని నా మంచితనాన్ని చెడుగా చూపిస్తావా.. మీరిద్దరూ బాగుపడరు నేను ఊరుకున్నా.. పైన ఉన్న దేవుడు మాత్రం మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు అని తులసి శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
ప్రేమ్ శృతి బట్టలు తీసుకు వచ్చి బయట గార్డెన్ లో పడేస్తాడు. ఎందుకు నా బట్టలు తీసుకు వచ్చి ఇక్కడ వేశావు.. అవన్నీ ఉతికినవి.. అని అంటుంది శృతి అంతలో ప్రేమ్ వాటర్ బకెట్ పట్టుకుని నీళ్లు పోస్తాను అని అంటాడు.. వద్దు ప్రేమ్ ఇవన్నీ ఉతికినవి నేను ఇప్పుడు మళ్లీ ఉతుక్కోలేను.. ప్లీజ్ ప్లీజ్ నాకు అంత ఓపిక లేదు అని శృతి బ్రతిమిలాడుతుంది.. నిన్న నా చేత ఉప్పు కలిపిన పాలు తాగించావు కదా.. అప్పుడు నా పైన కాస్త కూడా జాలి కలగలేదు నీకు.. ఇప్పుడు నేనెందుకు నిన్ను వదిలిపెడతాను అని ప్రేమ్ శృతి చూస్తుండగానే.. ఆ బట్టల పైన కావాలని వాటర్ బకెట్ తో నీళ్లు పోస్తాడు..
రేపటి ఎపిసోడ్ లో లాస్య, నందు ఏమీ తెలియనట్టు సామ్రాట్ దగ్గర తమ ప్రాజెక్ట్ ఓకే చేయించు కోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తులసి పై లేని పోనివి చెప్పి సామ్రాట్ కు తులసి పై కోపం వచ్చేలా చేస్తారు.. సామ్రాట్ కోపంగా తులసి నా ప్రాజెక్ట్ క్యన్సిల్ చేస్తుందా.. ఇది నాకు ఇబ్బందిగా ఉంది అని నందు తో అంటాడు.. తనని అంత తేలికగా వదలను అని అంటుంది సామ్రాట్ అంటాడు..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!