Telugu TV Serials

ఇదేమి ట్విస్ట్… మళ్ళీ మోనిత కార్తీక్ తో పిల్లల్ని కనటానికి ట్రై చేస్తుందా..?మరి దీప పరిస్థితి ఏంటి..?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1448 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 3న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో దీప తన బిర్యానీ వాసనతో కార్తీక్ ను రప్పించి ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి తనకు గతం గుర్తొచ్చేలా చేయాలనీ చూస్తుంది. ఇక మోనిత దీప ప్లాన్ ఏంటి అసలు అనే ఆలోచనలో పడుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..కార్తీక్ ఇంటికి వచ్చి దీప గురించి ఆలోచనలో పడతాడు.ఒక మనిషికి ఇన్ని పేర్లు ఉన్నాయి ఏంటి అని అనుకోని ఆలోచనలో పడతాడు.అయినా నాకు తన పేరు బాగానే గుర్తు ఉంది. చూద్దాం రేపు కూడా ఈ పేరు గుర్తుకుంటుందో లేదో అని అనుకుంటాడు.

దీప ఎంట్రీతో టెన్షన్ పడుతున్న మోనిత :

సీన్ కట్ చేస్తే సౌర్య వారణాసితో కలిసి ఆటోలో వెళ్తు తన తల్లి తండ్రుల కోసం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ తన తల్లిదండ్రులు కనిపించకపోయేసరికి చాలా బాధపడుతుంది. మరోవైపు మోనిత ఎందుకయ్యా దీపను మళ్ళీ బతికించావు అని దేవుడితో మోరపెట్టుకుంటుంది. కార్తీక్ ను నా సొంతం చేసుకునే సమయంలో మళ్ళీ దీన్ని నా మా జీవితాల్లోకి ఎందుకు పంపించావు అంటూ దేవుడిని నిలదీసినట్లు మాట్లాడుతుంది.ఏదోటి చేసి దీన్ని ఇక్కడ నుండి పంపించేయాలి అని అనుకుంటుంది.. సరిగ్గా అప్పుడే వంటలక్క అక్కడికి వచ్చి డాక్టర్ బాబు అని పిలుస్తుంది. కార్తీక్ తనను డాక్టర్ బాబు అని పిలవద్దు అని అనడంతో వెంటనే దీప మోనితతో కూడా డాక్టర్ అమ్మ అని పిలవాలని ఉంది అని అంటుంది. దాంతో మోనిత మరింత చిరాకు పడుతుంది. పోనిలే మోనిత పిలవనివ్వు అంటాడు

కార్తీక్ కు గతం గుర్తుచేసే ప్రయత్నంలో దీప :

డాక్టర్ బాబు మీకు మీ ఆవిడకు సంబదించిన జ్ఞాపకాలు ఏమి గుర్తులేవా అని అడగడంతో లేదు.. నాకు ఆక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగలడంతో అన్ని మర్చిపోతున్న అంటాడు. వెంటనే మా విషయాలు నీకు ఎందుకు అని అంటుంది. ఇక ఆ తర్వాత దీప కార్తీక్ కు బిర్యానీ వడ్డించగా ఆ బిర్యాని కి కార్తీక్ ఫిదా అవుతాడు..ఇక ప్రతిరోజు ఇలాగే చెయ్యు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత దీప మోనితతో ఇంకా ఆయన మనసులో నాకు చోటు ఉంది అని తెగ మురిసిపోతుంది. కానీ నీవు వేసే మందుల వల్ల నేను ఆయన గుర్తుకు రావట్లేను.ఎలాగయినా అన్ని ఆయనకు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటుంది దీప.

డాక్టర్ అన్నయ్యా ఇంటికి వెళ్లిన దీప :

ఆ తర్వాత దీప తన డాక్టర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పటంతో వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఆ డాక్టర్ అన్నయ్య మోనిత, కార్తీక్ మధ్య రిలేషన్ గురించి అడగటంతో వారు బాగానే ఉన్నారు అని దీప చెబుతుంది. వెంటనే ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ నాకు ఎందుకో మోనిత పిల్లలు కనడానికి ప్రయత్నిస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది.వెంటనే దీప అలా జరగనివ్వను అని చెబుతుంది.

అమ్మా నాన్నల కోసం బాధపడుతున్న సౌర్య:

ఇక సౌర్య మాత్రం తన అమ్మ నాన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి బతికున్నారని నీకు నమ్మకం ఉందా అని అంటే ఉంది అంటుంది. మరి అదేదో నువ్వు మీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని వెతుకొచ్చు కదా అంటాడు. వెంటనే సౌర్య వారణాసి పై మళ్లీ ఫైర్ అవుతుంది. ఇక వారణాసి ఏమనకుండా మౌనంగా సరే అమ్మా ఇంకా ఏమి మాట్లాడను. అన్నం తినమ్మా అంటే సౌర్య ఏడుస్తూనే మా అమ్మా నాన్నలతో కలిసి ఎప్పుడు భోజనం చేస్తానో అని బాధ పడుతుంది. ఇక దీప దేవుడి దగ్గరికి వెళ్లి ఇక ఇప్పటినుంచి మళ్లీ డాక్టర్ బాబు ప్రేమ కోసం వంటలు చేస్తున్నాను అని దండం పెట్టుకుంటుంది.ఇక తరువాత ఎపిసోడ్ లో మోనిత ఫుడ్ పాయిజన్ అయినట్లు నాటకం ఆడుతుంది. మోనిత నాటకాన్ని పసిగట్టలేని కార్తీక్ ఆవేశంగా దీప దగ్గరకు వచ్చి నానా మాటలు అని దీపను అవమానిస్తాడు..


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసి అంకిత డబ్బులు తీసుకుందా.!? అందుకే గాయత్రి తో అంకితను పంపించేస్తానందా తులసి.!?

bharani jella

Karthika Deepam: స్వప్న మనసులో శోభ పెట్టిన చిచ్చు… ఊరు వదిలి వెళ్ళిపోనున్న జ్వాల..!

Ram

వావ్ అనాల్సిందే.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ చూసి..!

bharani jella