Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 717: ఇంటింటి గృహలక్ష్మి లో నెక్స్ట్ వీక్ జరిగేది ఇదేనా.!?

Share

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. చక్కటి కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా కట్టిపడేస్తోంది.. ఇప్పటికే 716 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఊహించని ట్విస్టులు ఇస్తోంది.. ఇప్పటివరకు జరిగిన కథనంతో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ గురించి క్లయింట్ తో మాట్లాడటానికి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారు. అంతలో బిజినెస్ ఐడియా చెప్పాల్సిన ఫైల్ మర్చిపోవడంతో నందుని రమ్మని చెబుతాడు. సామ్రాట్ ఇక నందు తో పాటు లాస్య కూడా వస్తుంది. సామ్రాట్ వాళ్లు ఏం చేస్తున్నారో రన్నింగ్ కామెంటరీ చెప్పడానికి ఇక ఫ్లైట్లో బత్తాయి బాలరాజు అంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి నందు పై బ్రహ్మాండమైన పంచేస్ వేయిస్తారు.. సగటు వీక్షకుడికి నందుని ఇన్ డైరెక్ట్ గా ఎవరైనా తిడుతుంటే చూడాలని ఆసక్తి కలుగుతుంది.. అడ్వాంటేజ్ గా తీసుకొని సీరియల్ ని సరికొత్త ట్రాక్ లో నడిపించారు..

అంకిత చెప్పిందని ప్రేమ్ వెళ్లి శృతిని తీసుకురావాలని అనుకుంటాడు. కానీ శృతి మాటలకు కోపం వచ్చిన ప్రేమ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. నువ్వు కూడా మీ నాన్నకు మళ్ళే తయారయ్యావు అని ప్రేమ్ నీ శృతి అనడంతో.. అప్పటివరకు తన కోసం ప్రేమగా ఎదురు చూస్తున్న ప్రేమ్ మనసు ముక్కలవుతుంది. ఇక నీకు నాకు సంబంధం లేదు ఇదే మనం ఆఖరి సారి కలుసుకోవడం అని ప్రేమ్ చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు.. ఇన్ని రోజులు శృతి నీ కోసం తను ఎదురు చూసింది.. తనలో ఉన్న బాధని నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా రావడం కరెక్ట్ కాదు అని అంకిత ప్రేమ్ కి అర్థమయ్యేలా చెబుతుంది.. దయచేసి ఈ టాపిక్ ఎక్కడిదో వదిలేయమని ప్రేమ్ అంటాడు.. ఇప్పటివరకు ప్రేమ వాళ్ళ అమ్మ దగ్గర శృతి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పి మేనేజ్ చేశాడు. కానీ శృతి ప్రేమ్ గొడవపడి ఇలా దూరంగా ఉంటున్నారన్న విషయం తులసికి తెలియదు. వచ్చేవారం ఈ సీక్రెట్ రివిల్ అవుతుంది ప్రేమ్ ని కి చివాట్లు పెట్టి తులసి శృతికి నచ్చజెప్పి మళ్లీ వాళ్ళిద్దర్నీ ఒక్కటి చేస్తుంది. ఇదే వచ్చేవారం హైలెట్ సీన్..

తులసి వాళ్ళు వైజాగ్ టూర్ లో ఉండగా ప్రేమ ఫోన్ చేసి తాతయ్యకు గుండెల్లో నొప్పిగా ఉందని చెబుతాడు. ఒకవైపు అభి వాళ్ళ తాతయ్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కానీ మరోసారి వాళ్ళ తాతయ్యకు హాట్ ఆపరేషన్ అవుతుందని తెలియడంతో తులసి ఆ డబ్బులు కోసం వెతుక్కుంటుంది. అప్పుడే సామ్రాట్ తులసికి సపోర్టుగా నిలబడతాడు. ఈ డబ్బులు మీరు మళ్ళీ తీసుకుంటాను అంటేనే నేను తీసుకుంటాను అని తులసి చెబుతుంది.. తులసి మంచితనం అర్థం చేసుకున్న సామ్రాట్ ఆ కండిషన్ కు ఒప్పుకొని తనకు డబ్బులు ఇస్తాడు. వచ్చేవారం ఇదొక హైలెట్ ట్విస్ట్ కానుంది..


Share

Related posts

మెల్లమెల్లగా సౌర్యకు దగ్గరవుతున్న నిరూపమ్…స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సౌర్య.!

Ram

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” విత్ NBK కి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన ఆహా..!!

sekhar

God Father: చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’ ఫ‌స్ట్ లుక్ డీటెయిల్స్..!!

sekhar