Karthika Deepam: వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వంటలక్క అనగానే ముందుగా గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం. గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ మా చానల్లో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ టీవీకే వారిని పరిమితం చేసిన కార్తీకదీపం సీరియల్ ఈమధ్య ముగిసిన విషయం తెలిసిందే.

ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో ముగ్గురు కూడా పోటీపడి మరీ నటించారు . మరీ ముఖ్యంగా వంటలక్క ఈ సీరియల్ తో ఎంత పాపులారిటీ దక్కించుకుంది అంటే ఈమె కోసం సీరియల్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

కార్తీకదీపం సీరియల్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె సీరియల్ ముగియడంతో అభిమానులు సైతం పూర్తిస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. వంటలక్క మల్లి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాలి అని.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు . ఇదిలా ఉండగా మరొకవైపు నాగచైతన్య, కృతి శెట్టి జంటగా వచ్చిన కస్టడీ సినిమాలో ఈమె మంగళం అత్త క్యారెక్టర్ లో నటించి తన నటనతో ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం తెలుగు సీరియల్స్ ముగియడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఖుషి సినిమా లోని ఆరాధ్య పాటకు తనకు ఇష్టమైన సూపర్ పర్సన్ తో అడుగులు వేసి అందరిని ఆకట్టుకుంది .

ఈ పాటలో కూడా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని అలరించింది ప్రేమీ విశ్వనాథ్. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆమె షేర్ చేసుకోగా.. ప్రస్తుతం చాలా వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లు సైతం రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రేమీ విశ్వనాథ్ ను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.