Ambati Rambabu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినీ రంగంలో హీరోగా తన సత్తా చాటుతూనే రాజకీయాల్లో జనసేనానిగా ఏపీలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార వైసీపీపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో విపరీతమైన మైలేజీతో ఉన్న వైసీపీ సర్కార్ ను ఎన్నికల్లో ఎదుర్కోవడం ఒక్క టీడీపీ వల్ల కాని పరిస్థితి నెలకొని ఉండటంతో ఆ పార్టీకి దన్నుగా నిలబడటానికి సిద్దమైయ్యారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన పోటీ చేయాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆవేశంతో చేసే ప్రసంగాలను వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు.

తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ దారుణంగా కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ప్రత్యర్ధి నేతలపై ఇలాంటి కామెంట్స్ యే చేస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తమదైన శైలిలో స్పందించారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి మరింత దారుణంగా పవన్ పై విమర్శలు లంఖించారు. పవన్ చేస్తున్న రాజకీయాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పవన్ అసలు రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ను ఒక మానసిక రోగి అన్న కామెంట్స్ పై తీవ్రంగా రియాక్ట్ అవుతూ నిజానికి అలాంటి రోగాలు, జబ్బులు అన్నీ పవన్ కే ఉన్నాయని అన్నారు అంబటి. అంబటి ఓ అడుగు ముందుకు వేసి మల్టిపుల్ పర్సనల్ డిజాస్టర్ అనే వ్యాధితో చాలా కాలంగా పవన్ బాధపడుతున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి కారణంగానే పవన్ కల్యాణ్ లో నిలకడ లోపించిందన్నారు. ఆయన ఏమి చేస్తున్నారో కూడా ఆయనకే అర్ధం కాని పరిస్థితి ఉందని అన్నారు.

పవన్ ముఖ్యమంత్రి కావాలని జనసేనలోని కార్యకర్తలు పని చేస్తుంటే ఆయన మాత్రం చంద్రబాబు కోసం పని చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ పై పవన్ వ్యక్తిగతంగా దూషణలు చేయడం చూస్తుంటే ఆయన ఆక్రోశం, చేతగాని తనమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సత్తా లేకపోతేనే ఇలాంటి మాటాలు మాట్లాడతారని అంబటి అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న విమర్శలకు పరిణామాలు ఎలా ఉంటాయో తర్వాత అర్ధం అవుతుందని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి వస్తుందన్న భ్రమలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారనీ, అసలు అది ఎక్కడైనా కనబడుతోందా అని ప్రశ్నించారు. బాబును అరెస్టు చేసి సానుభూతి ఆ పార్టీకి వచ్చే విధంగా చేయడానికి తాము ఏమన్నా తెలివితక్కువ వాళ్లమా అని ప్రశ్నించారు.

పవన్, చంద్రబాబు ముసుగు తొలగించి కలిసి రావాలని తాము గట్టిగా కోరుకుంటున్నామనీ, అది ఈ రోజుతో తీరిందని అన్నారు. ఆ ఇద్దరు కలిసి వస్తేనే ఓడించి పంపించే వ్యూహాలు, లెక్కలు తమకు ఉన్నాయని అంబటి పేర్కొన్నారు. నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తుంటే గ్రామాల్లో గొడవ చేసుకనే వ్యక్తుల మధ్య జరిగే తిట్ల పురాణం గుర్తుకు వస్తుందని అంటున్నారు. ఓ వ్యక్తిని పట్టుకుని నీకు మెంటల్ అని ఎవర అంటే .. నాకు కాదు నీకు, మీ నాన్నకు, మీ అమ్మకు మెంటల్ అని ఎదురుదాడి చేస్తుండటం కనబడుతోంది. ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్య అటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు వినబడుతున్నాయి.
Nara Brahmani: అట్టర్ ఫ్లాప్ అయిన నారా బ్రాహ్మణి ప్లాన్ – నువ్ ఇంకా ఆపేయ్ అన్న బాలయ్య ?