Nara Brahmani: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీ సీఐడీ అరెస్టు చేసి జైల్ కు పంపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణి రాజమండ్రిలోనే మకాం వేశారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం జాతీయ స్థాయిలో నాయకులకు వివరించి మద్దతు కూడగట్టుకునే పనిలో నారా లోకేష్ మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. జాతీయ మీడియాలో చంద్రబాబు అరెస్టు వ్యవహారం మాట్లాడుతూ ముఖ్య నేతలను కలుస్తూ చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్టు చేసారని వివరిస్తున్నారు.


మరో పక్క రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి లు అక్కడి మహిళలతో కలిసి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంలో బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు రిమాండ్ రిపోర్టు ను దేవాన్ష్ చదివినా .. అరెస్టు కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెబుతాడని అన్నారు. తప్పు చేయని తాము ఎవరికీ భయపడమని, తమ వెనుక అయిదు కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, టీడీపీ కుటుంబం ఉందని అన్నారు. తమలో పోరాట స్పూర్తి ఉందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం తమకు ఉందని చెప్పారు. చంద్రబాబు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కల్గిన నాయకుడనీ, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ అని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రజల కోసం కష్టపడిన అలాంటి నాయకుడి ని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమమనీ, ఇలాంటి పరిణామం చూసి ఓ యువతిగా తాను చాలా బాధపడుతున్నానని అన్నారు.
చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడికే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలే ఆలోచించాలన్నారు బ్రాహ్మణి. చంద్రబాబు లాంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా, అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా అని బ్రాహ్మణి ప్రశ్నించారు. బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మహిళా నేత, ఏపీ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడిన బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం దుస్సుమంది అని వ్యాఖ్యానించారు రోజా.
చంద్రబాబును డైరెక్టుగా ఎలా అరెస్టు చేశారనీ బ్రాహ్మణి అంటోందనీ, సాక్ష్యాధారాలతో దొరికిన దొంగను జైల్ కు పంపుతారు కానీ జైలర్ సినిమాకు పంపుతారా అని రోజా ప్రశ్నించారు. దయచేతి దేవాన్షుకు బాబు రిమాండ్ రిపోర్టు చూపించవద్దనీ, చూపిస్తే వాళ్ల తాత ఎంత పెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని అంటూ రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు జైల్ లో ఉండటంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ (బాలయ్య) ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నారా బ్రాహ్మణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందనీ, దీంతో ఇక ఆపేయ్ అంటూ బాలయ్య సలహా ఇచ్చాడని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు.
AP Skill Development Scam: ఈ రోజే మరో ఏడుగురు అరస్ట్ ? స్కిల్ డవలప్మెంట్ స్కాం !