బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రసారం కావడానికి మొత్తం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి లోగోతో పాటు ప్రోమో విడుదల చేయడం జరిగింది. ప్రోమో లో నాగార్జున కనిపించడంతో ఈసారి సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ పరిణామంతో వరుసగా నాలుగోసారి తెలుగు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా నాగార్జున రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 4వ తారీఖు నుండి షో ప్రారంభించాలని షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట.
దాదాపు 100 రోజులకు పైగా షో నిర్వహించాలని.. ఇందుకు గాన సెప్టెంబర్ మొదటివారం నుండి ప్రారంభించాలని.. ప్లాన్ చేసుకోవడం జరిగిందట. అయితే ఇప్పటికే కంటెస్టెంట్స్ ని మొత్తం అందరిని సెలెక్ట్ చేసినట్లు.. దాదాపు 19 మంది సెలెక్ట్ అయినట్లు టాక్. వీరిలో 15 మందిని ముందుగా హౌస్ లోకి పంపించి మిగతా నలుగురిని వైల్డ్ కార్డు రూపంలో పంపించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. దీంతో కరోనా జాగ్రత్తలు తీసుకుని మొదట 15 మందినీ ఆగస్టు 26 లేదా 27వ తారీకు క్వారంటైన్ లోకి పంపించేయోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.
దాదాపు వారం రోజులపాటు క్వారంటైన్ లో ఇంటి సభ్యులను ఉంచి వారి ఆరోగ్య పరిస్థితి మొత్తం తెలుసుకొని హౌస్ లోకి పంపించాలనే డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించి గ్రాండ్ ఎంట్రీ కార్యక్రమం త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ ఓటిటి అట్టర్ ఫ్లాప్ కావడంతో..సీజన్ సిక్స్ నీ షో నిర్వాహకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. గతంలో మాదిరిగా ఫిజికల్ టాస్కులు ఉండకుండా వెరైటీ ఉండే రీతిలో.. ఒకపక్క పోటీ మరోపక్క ఫన్ క్రియేట్ అయ్యేలా చూసే ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!