బిగ్ బాస్ 4 : సోది లవ్ స్టోరీలతో చచ్చిపోయిన ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ న్యూస్…!

Share

ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి వారం గడిచింది. ఒకరు ఎలిమినేట్ కూడా అయిపోయారు. అప్పుడే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు కూడా వచ్చేశాయి. రెండో వారంలో షో బాగానే జరుగుతుంది కానీ బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు ఇది తెలుగు బిగ్ బాసా లేదా ఇంగ్లీష్, తమిళ్ బిగ్ బాస్ ఆ అని అనుమామం కలుగుతోంది. ఇంట్లో తెలుగు మాట్లాడాలన్న నిబంధన కూడా ఎవరూ పట్టించుకోలేదు.

 

ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే బిగ్ బాస్ ఇన్ని రోజులు ఎలాంటి శిక్ష విధించకుండా నిద్రపోతున్నట్లు కనిపించాడు. కాబట్టి బిగ్బాస్ ఇంట్లోకి వచ్చిన రోజు నుండి ఏ ఒక్కరి నిబంధనలు పాటించలేదని తనదైన శైలిలో వారందరికీ చుక్కలు చూపించాడు. తెలుగు వచ్చిన వాళ్లు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే బిగ్ బాస్ మాత్రం ఏమి చేస్తాడు? ఇక తెలుగు రాని వాళ్ళు అయితే మరీ ఘోరంగా మాట్లాడేస్తున్నారు. అది తెలుగు ప్రేక్షకులు చూసే షో అని కనీస ఆలోచన లేకుండా అందరితో తమకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు.

తమిళం, హిందీ ఇంగ్లీష్ లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే చూడలేక ప్రేక్షకులు చూస్తున్నారు. ఈలోపల ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి. ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోసం చూస్తే అసలు ఎప్పుడూ ఏ కొలిక్కిరాని ఒక లవ్ స్టోరీని సాగదీస్తున్నారు నిర్వాహకులు. ఇంకా గత కొన్ని రోజులుగా మోనాల్ కు సంబంధించిన ఫుటేజీ వేస్తుంటే.. అందులో ఆమె ఏమైనా తెలుగు మాట్లాడుతుంది అంటే అది లేదు.

ఇక ఆమెతో మాట్లాడే వారు సైతం హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఏదో కామెడీకి గంగవ్వ కొన్ని పదాలు చెబుతూ ఉంటే వింటూ వచ్చింది కానీ నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరికీ ముప్పతిప్పలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రూల్స్ బ్రేక్ చేసినందుకు శిక్షిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రోమోలో చూపించారు. ఇకనుంచి కంటెస్టెంట్ లు అందరూ తెలుగులోనే మాట్లాడతారేమో చూద్దాం. మొత్తానికి వీరు తీసిన గుంజీలకి ప్రేక్షకులకు సంతృప్తి ఎంటర్టైన్మెంట్ రెండూ లభించబోతున్నాయి.


Share

Related posts

రామ్ గోపాల్ వర్మ దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్ విడుదల; ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్

Vihari

Aditi Ravi New Gallerys

Gallery Desk

పాయల్ రాజ్‌పుత్ ఆ దర్శకుడి రుణం తీర్చుకుంటోంది..!

GRK