బిగ్ బాస్ నాలుగో సీజన్ హోస్ట్ నాగార్జునకు ఫుల్లుగా కోపం వచ్చేసింది. కాంటెస్టెంట్స్ అందరిపై వీకెండ్ ఎపిసోడ్లో ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు నాగ్. దీనికి సంబంధించిన ప్రోమో ని స్టార్ మా విడుదల చేయగా అందులో నాగార్జున ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు అంటూ వారిపై విరుచుకు పడ్డాడు. నామినేషన్ సమయంలో అసలు అందరూ ఎందుకు నేను నామినేట్ అవుతా అంటే నేను నామినేట్ అవుతా అంటూ ముందుకు వస్తున్నారని నాగార్జున.ప్రశ్నించాడు.
బిగ్ బాస్ రూల్స్ ను పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లు గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్స్ పై కూడా నాగార్జున ఫుల్ గా సీరియస్ అయిపోయాడు. అలాగే ఆటను సీరియస్గా తీసుకోకుండా మీరు సేఫ్ గేమ్ ఆడదాం అని అనుకుంటున్నారేమో…. నేను అది జరగనివ్వను అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక నోయల్, అభిజిత్ లకు అయితే ఒక పెద్ద క్లాస్ పీకాడు నాగార్జున. నీ ఆట నువ్వు ఆడు నీ పని ఏంటి…. నువ్వు చేసేది ఏమిటి అని నాగార్జున నోయల్ ను ప్రశ్నించాడు.
అలాగే అభిజిత్ తో…. నీకు ఓట్లేసి జనాలను గెలిపిస్తారని నువ్వు ఇక ఎలిమినేట్ అవ్వవు అని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా అని ప్రశ్నించాడు. దానికి అభిజిత్ నోటమాట రాలేదు. అసలు గేమ్ ను అందరూ ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారో నాగార్జున తనకు అర్థం కావడం లేదని అన్నారు. అతను అందరికీ చాలా భారీ గా క్లాస్ పీకడం తో ఒక్కసారిగా హౌస్ ప్రశాంతత ఆవరించింది. ఇక నామినేషన్ సమయం లో నోయల్ పాట స్టార్ట్ చేయగా అందరూ దానికి కోరస్ పాడడం నాగార్జున. కు మరింత కోపం తెప్పించింది. ఇక నాగ్ ఎవరెవరిని ఏమేం మాటలు అన్నాడు అని తెలుసుకోవడానికి ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ చూడాల్సిందే.