Entertainment News ట్రెండింగ్ న్యూస్ సినిమా

నాటి చిరంజీవి మెగా హిట్ సినిమాలు..నేటి స్టార్ హీరోలు ఎవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకుందాం..!!

Share

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించి.. స్వయంకృషితో ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇండస్ట్రీలో ఒక్కడిగా అడుగు పెట్టిన చిరంజీవి కోట్లాదిమంది అభిమానం సంపాదించి సినిమా ఇండస్ట్రీలో చెక్కుచెదరని చరిత్ర సృష్టించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే చిరంజీవి తన డాన్స్ మరియు ఫైట్స్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎంతోమంది నటీనటులకు చిరంజీవి ఆదర్శంగా నిలిచారు. అయితే నాటి చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రస్తుత స్టార్ హీరోలకు ఎవరికి ఏది సూట్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాం.

Chiranjeevi Birthday Special Story
పసివాడి ప్రాణం:

1987వ సంవత్సరంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో.. అల్లు అర్జున్ ఇంకా చరణ్ కి బాగా సూట్ అయ్యే క్యారెక్టర్. బాగా కష్టపడే తత్వం కలిగిన హీరోయిజం ఈ సినిమాలో కనిపిస్తోంది.

ఖైదీ:

మెగాస్టార్ చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా. ఇది కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా 1983వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఖైదీలో చిరంజీవి యాక్షన్ అప్పటి మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చాలా కోపంగా.. ఎంతో వైల్డ్ లుక్ లో చిరంజీవి కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న హీరోలలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కి కరెక్టుగా సూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మంచి మాస్ కంటెంట్ నీ చాలా బ్యాలెన్స్ చేస్తూ తెరపై మాస్ ఆడియన్స్ నీ మెప్పించే సిద్ధహాస్తులు.

అభిలాష:

ఇది కూడా 1983 వ సంవత్సరంలోనే విడుదలైన సినిమా. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి లాయర్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న హీరోలలో రీమేడ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ కి కరెక్టుగా సూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

చాలెంజ్:

1984వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి కష్టపడి కొన్ని లక్షలు సంపాదిస్తాడు. నిరుద్యోగిగా ఉండే చిరంజీవికి రావుగోపాలరావు విసిరే డబ్బు సంపాదించే సవాల్ ఆసక్తిగా ఉంటుంది. డబ్బు కోసం చిరు కష్టపడే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ప్రస్తుతం ఉన్న హీరోలలో రీమేడ్ చేస్తే..రామ్, నితిన్ చక్కగా పోషించే కంటెంట్ కలిగిన స్టోరీ.

Special Story on 31 years of Chiranjeevi in Telugu Cinema
విజేత:

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1985 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా చిరంజీవి నటనలో మరో కోణాన్ని బయటపెట్టింది. ఫుట్ బాల్ ఆటగాడిగా చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారు. అయితే ఫుట్ బాల్ లీగ్ రాణించాలని చిరంజీవి కష్టపడే విధానం.. కుటుంబం నుండి వచ్చే అవరోధాలను ఎదుర్కోవటంతో పాటు అవమానాలను తట్టుకుంటాడు. అయితే కుటుంబంలో కష్టాలు వాళ్ళ చివరకి..కిడ్నీలు డొనేట్ చేసి కుటుంబ కష్టాలను గట్టెకించి తండ్రి ప్రాణాలను కాపాడటంతో జీవితంలో నిజమైన విజేతగా నిలుచుతాడు. ఫ్యామిలీ డ్రామా కంటెంట్ కలిగిన ఈ సినిమా ప్రజెంట్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ, నితిన్ లకి బాగా సూట్ అవ్వచ్చు.

యముడికి మొగుడు:

1988వ సంవత్సరంలో రవిరాజ పిన్ని శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపిస్తాడు. ఒకటి అమాయకమైంది, మరొకటి చాలా రఫ్ క్యారెక్టర్. కానీ హఠాత్తుగా చిరంజీవి చనిపోవడం యమలోకానికి వెళ్ళటం.. అక్కడి నుండి స్టోరీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇదే సినిమా ప్రజెంట్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తో రీమేడ్ చేస్తే కరెక్టుగా సూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ తరహా లోనే జూనియర్ ఎన్టీఆర్… రాజమౌళి దర్శకత్వంలో “యమదొంగ” చేశాడు. అదే ఫ్లేవర్ “యముడికి మొగుడు” లో కనిపిస్తది.

Chiranjeevi Special Story 8

ఏది ఏమైనా 2000 సంవత్సరానికి ముందు.. చిరంజీవి నటించిన చాలా సినిమాలు తెలుగు సినిమా రంగాన్ని మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాయి. అప్పట్లో చిరంజీవి వేసిన స్టెప్పులు.. చేసిన ఫైట్లు.. సినిమా ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. సినిమాలో పాట వచ్చిన సమయంలో డాన్స్ వేయాల్సిన హీరోకి బదులు కెమెరా ఊపోసే పరిస్థితులు ఉండే ఆ రోజులలో చిరంజీవి వేసిన స్టెప్పులు ట్రెండ్ సెట్ అయ్యాయి. దాంతో మిగతా హీరోలంతా డాన్స్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలు తమదైన శైలిలో డ్యాన్స్ వేస్తున్నారంటే దానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆది పురుషుడు చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 60 సంవత్సరాలు దాటినా గాని ఇప్పటికీ కూడా చిరంజీవి తనలో ఉన్న రిథమ్ కెమెరా ముందు అద్భుతంగా ఆడిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారు.


Share

Related posts

Prabhas: యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్..??

sekhar

క్రాక్ సినిమాకి కోలీవుడ్ మేకర్స్ నుంచి భారీ ఆఫర్ ..?

GRK

జబర్దస్త్ లో అనసూయ ప్లేస్.. రీప్లేస్ చేసింది ఆమెనా??

sekhar